Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్గన్ నుంచి యూఎస్ బలగాల ఉపసంహరణ.. ‘తార్కిక, హేతుబద్ధమైన నిర్ణయం’.. జో బిడెన్ సమర్థణ

తాలిబాన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకోవడంతో అఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకున్నందుకు జో బిడెన్ ప్రభుత్వం కొన్ని వర్గాల నుండి విమర్శలను ఎదుర్కొంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడంతో బలగాలు ఉపసంహరించుకోవడం నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితి, మరణాలు సంభవించాయి. 

Troops withdrawal from Afghanistan was a 'logical, rational and right decision': Joe Biden rejects criticism
Author
Hyderabad, First Published Aug 23, 2021, 11:44 AM IST

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్ర సంక్షోభం నేపథ్యంలో అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకున్న తన చర్యను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సమర్థించుకున్నారు. చరిత్ర దీన్ని  "తార్కిక, హేతుబద్ధమైన, సరైన నిర్ణయం"గా రికార్డు చేస్తుందని అన్నారు.

తాలిబాన్లు అధికారాన్ని స్వాధీనం చేసుకోవడంతో అఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ బలగాలను ఉపసంహరించుకున్నందుకు జో బిడెన్ ప్రభుత్వం కొన్ని వర్గాల నుండి విమర్శలను ఎదుర్కొంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడంతో బలగాలు ఉపసంహరించుకోవడం నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితి, మరణాలు సంభవించాయి. అయితే, జో బిడెన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "చరిత్రలో ఇది తార్కిక, హేతుబద్ధమైన, సరైన నిర్ణయం అని రికార్డ్ చేయబోతోందని’ అన్నారు. 

ఇండియన్-అమెరికన్ పొలిటీషియన్, ఐక్యరాజ్యసమితిలోమాజీ అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ ఈ సమావేశానికి ముందు మాట్లాడుతూ.. అమెరికా ప్రభుత్వం తమ పౌరుల్ని తాలిబన్లకు అప్పగించింది. బలగాలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయానికి ముందు తన పౌరుల్ని అక్కడ్నించి తరలించాలి. 

అమెరికన్ ప్రజలను ఉపసంహరించుకునే ముందు మా దళాలను ఉపసంహరించుకున్నారు. మా ఆఫ్ఘన్ మిత్రదేశాల నుంచి అక్కడున్న నా భర్త లాంటి వారిని ఎవరు కాపాడతారు. అక్కడ ఎక్వరూ సురక్షితంగా లేరు. కాబట్టి, చర్చలు లేవు. ఇది పూర్తిగా లొంగుబాటు చర్య, ఘోరమైన వైఫల్యం" అని ఆమె అన్నారు.

తాలిబాన్ చట్టబద్ధతను కోరుతోంది. వాగ్దానాలు చేసింది. కానీ "వారు మరి మాటను నిలుపుకుంటారా, లేదా" వాషింగ్టన్ గమనిస్తుంది.. అని అమెరికా జో బిడెన్ అన్నారు. ఆఫ్గనిస్తాన్ ను వశం చేసుకున్న తాలిబాన్లను నమ్ముతున్నారా? అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇస్తూ "నేను ఎవరినీ నమ్మను" అని చెప్పుకొచ్చారు.

జో బిడెన్ వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సంద్భంగా మాట్లాడుతూ.. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఏమైనా చేయాలని ప్రయత్నిస్తుంటే, వారికి ఆర్థిక సహాయం, వాణిజ్యం లాంటి అనేక విషయాల్లో... అదనపు సహాయం అవసరమని బిడెన్ అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌: తాలిబన్లకు తిరుగుబాటుదారులు షాక్.. 11 మంది ఫైటర్లు హతం, బందీలుగా మరికొందరు

అంతేకాదు "నేను ఎవరినీ విశ్వసించను. గత వందేళ్లలో ఏ గ్రూపూ దీన్ని సాధించని...ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్ని ఏకతాటిమీదికి తీసుకువచ్చి, వారంతా ఐకమత్యంగా ఉండేలా చేయడానికి వారి శ్రేయస్సు కోసం కృషి చేయబోతున్నారా?.. అనే విషయం మీద  తాలిబాన్లు ఫండమెంటల్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంది. వారి శ్రేయస్సుకు, వారికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా? అలాగయితే అదే అయితే ఆర్థిక సహాయం, వాణిజ్యంలాంటి అనే విషయాల పరంగా అదనపు సహాయం వారికి కావాల్సి ఉంటుందని.. జో బిడెన్ తాలిబన్లను నమ్ముతున్నారా? అన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. 

"తాలిబాన్ వాగ్దానాలు చేసింది. కానీ, వారు మరి మాటను నిలుపుకుంటారా, లేదా? వాషింగ్టన్ గమనిస్తుంది.. ఇతర దేశాలు వీరిని గుర్తిస్తాయో లేదు తెలుసుకోవడానికి వారు చట్టబద్ధతను కోరుతున్నారు. వారు మన దౌత్యపరంగా వెళ్లాలని వారు కోరుకోవడం లేదు. ఇతర దేశాలతో పాటు అమెరికాకు చెప్పారు. ఇప్పుడు తాలిబన్ పూర్తిగా ఉనికిలో ఉంది. ఇప్పుడు ఈ చర్చ అంతా, ఇప్పటివరకు తాలిబన్లు US దళాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోవడం మీదే, "అన్నారాయన.

అంతేకాదు తాలిబన్లు అమెరికన్లను దేశంనుంచి దాటవేయడానికి అనుమతించే విషయంలో వారు చెప్పిన వాటిని అమెరికా పెద్దగా అనుసరించలేదని ఆయన అన్నారు. "వారు తమ బలగాలను నియంత్రించలేరని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానన్నారు. అది రాగ్‌ట్యాగ్ ఫోర్స్. కాబట్టి, వాళ్లు నిజమో కాదో మనం చూస్తాం" అని బిడెన్ అన్నారు.

36 గంటల వ్యవధిలో, అమెరికా దాదాపు 11,000 మందిని కాబూల్ నుంచి బయటకు తరలించిందని బిడెన్ చెప్పారు. "ఈ వారాంతంలో 30 గంటలలోపు, అసాధారణ సంఖ్యలో వ్యక్తులను తరలించాం, సుమారు 11,000 మందిని కాపాడాం. కాబూల్‌లో ఎయిర్, రోడ్ మార్గాన తరలింపు కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో ఈ సంఖ్య రోజురోజుకూ మారుతూ ఉందని చెప్పుకొచ్చారు. 

‘నేను ఎవ్వరినీ విశ్వసించను..వారేం చేస్తారో చూద్దాం’... తాలిబన్ల పై బిడెన్ వ్యాఖ్యలు...

అమెరికా పౌరులను వీలైనంత త్వరగా, సురక్షితంగా దేశం నుండి బయటకు తీసుకురావడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన అన్నారు. "నా ఆదేశాల మేరకు, విదేశాంగ శాఖ ఫోన్, ఇ-మెయిల్, ఇతర మార్గాల ద్వారా ఆచూకీ గుర్తించిన అమెరికన్లను రక్షించే ప్రణాళికల రచన కొనసాగుతుంది," అని ఆయన చెప్పారు.

NATO మిత్రదేశాల పౌరులు, దాని భాగస్వాములు, వారి దౌత్యవేత్తలు, ఆఫ్ఘనిస్తాన్‌లోని వివిధ రాయబార కార్యాలయ సిబ్బందితో సహా వీరిని కూడా స్వస్థలాలకు చేర్చేందుకు యూఎస్ వారిని ఖాళీ చేయిస్తోందన్నారు. "ఈ క్రమంలో మాతో పాటు  ఉన్న మా ఆఫ్ఘన్ మిత్రులను, మహిళా నాయకులు, జర్నలిస్టుల వంటి ఇతర బలహీన ఆఫ్ఘన్‌లను దేశం నుండి తరలించడానికి కూడా కృషి చేస్తున్నాం" అని ఆయన చెప్పారు.

"ఆగష్టు 14 నుంచి ఈ ఉదయం నాటికి దాదాపు 28,000 మందిని తరలించాం. US, సంకీర్ణ విమానాలలో, పౌర చార్టర్లతో సహా, జూలై నుండి దాదాపు 33,000 మంది పౌరులను తరలించినట్లు’ పేర్కొన్నారు. 

"ఈ వారాంతంలో 24-గంటల వ్యవధిలోనే, 23 యూఎస్ మిలిటరీ విమానాలు-14 C-17 లు, 9 C-130 విమానాల్లో 3,900 మంది ప్రయాణికులను తీసుకుని కాబూల్‌ నుంచి తరలాయన్నారు.  ఈ టెంపో మెయింటేన్ చేయకపోవడానికి కారణాలేవీ లేవన్నారు. అదే సమయంలో తమ సైన్యం మరో 35 చార్టర్ ఫ్లైట్‌లలో అదనంగా దాదాపు 4,000 మంది ఇతరదేశస్తుల్ని తరలించిందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios