శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ ఎదుట భారత జాతీయ జెండా రెపరెపలాడిండి. అక్కడున్న భారత సంతతి అమెరికన్లు కాన్సులేట్ దగ్గరికి చేరుకొని వందేమాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఖలిస్తానీ మద్దతుదారుల ముందే జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇటీవల సిక్కు వేర్పాటువాదులు శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ ను ధ్వంసం చేసిన నేపథ్యంలో భారత్ కు మద్దతుగా పెద్ద సంఖ్యలో ఇండో-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కో పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది భారతీయ అమెరికన్లు కాన్సులేట్ దగ్గరికి చేరుకున్నారు. భారత్ కు సంఘీభావం తెలుపుతూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సమయంలో వేర్పాటువాద సిక్కులు అక్కడి చేరుకున్నారు. కానీ వారి ముందే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గమనార్హం.
దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్ అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్
అయితే ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడున్న కొందరు వేర్పాటువాద సిక్కులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ఖలిస్తానీ జెండాలు ప్రదర్శించారు. కానీ వారి కంటే పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ అమెరికన్లు ‘‘వందేమాతరం’’ అంటూ నినదించారు. అమెరికాతో పాటు భారత జాతీయ జెండాను ఎగురవేశారు. భారతీయ అమెరికన్లు భారత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. కొందరు శృతిలో డప్పు కొడుతుండగా.. దానికి అనుగుణంగా కొందరు వందేమాతరం అంటూ పాటలు పాడుతూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ షేర్ చేసింది.
ఇటీవలి నెలల్లో కెనడా, ఆస్ట్రేలియా, యూకేలలో ఖలిస్తాన్ మద్దతుదారుల భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. ఈ దేశాలలోని కొన్ని హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. వాటిపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. గత ఆదివారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారుల బృందం దాడి చేసి ధ్వంసం చేసింది. ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ ఆందోళనకారులు నగర పోలీసులు ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా అడ్డంకులను పగులగొట్టి కాన్సులేట్ ఆవరణలో రెండు ఖలిస్తానీ జెండాలను ఏర్పాటు చేశారు. వెంటనే ఇద్దరు కాన్సులేట్ సిబ్బంది ఈ జెండాలను తొలగించారు.
దౌత్యవేత్తలకు భద్రత కల్పించాల్సిన బాధ్యతను బ్రిటన్ నెరవేర్చడం లేదు - విదేశాంగ మంత్రి జైశంకర్
అయితే శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ పై కొందరు ఖలిస్థాన్ అనుకూల శక్తులు జరిపిన విధ్వంస ఘటనపై భారత్ సోమవారం ఢిల్లీలోని అమెరికా చార్జ్ డి అఫైర్స్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరినట్లు న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది. సుమారు 4.2 మిలియన్ల మంది భారతీయ అమెరికన్ ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. వీరంతా యుఎస్ లో మూడవ అతిపెద్ద ఆసియా జాతి సమూహంగా ఉన్నారు.
