Asianet News TeluguAsianet News Telugu

టూరిస్ట్ విమానం ఇంజిన్ లో సమస్య.. సముద్రంలో ల్యాండ్ చేసిన పైలెట్.. చివరికి..

విమానం ఇంజిన్ చెడిపోవడంతో పైలట్ ఓ పర్యాటక విమానాన్ని ఆదివారం ఫ్రాన్స్‌లోని సముద్రంలో ల్యాండ్ చేశాడు, అందులో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు.

Tourist Plane Forces Sea Landing  After Engine Breakdown Sinks Off France - bsb
Author
First Published Jul 31, 2023, 9:02 AM IST

ఫ్రాన్స్ : ప్రస్తుల కాలంలో విమాన ప్రమాదాలు కామన్ గా మారిపోయాయి.  లాండింగ్ లోనో, టేకాఫ్ లోనో విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం.. ప్రయాణికుల పాలిట విషాదంగా మారుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఫ్రాన్స్ లోని మార్చెయిల్లో వెలుగు చూసింది. గాల్లో ఎగురుతున్న విమానం ఇంజిన్ లో సమస్యలు తలెత్తాయి. ఇక ఇంజిన్ ముందుకు సాగనంటూ మొరాయించింది.  

దీంతో ఏం చేయాలో తెలియక ఓ పైలట్ విమానాన్ని సముద్రంలోనే అర్ధాంతరంగా దించేశాడు. దీంతో విమానం సముద్రంలో మునిగిపోయింది. కానీ.. అదృష్టవశాత్తు అందులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 10 సమయంలో ఫ్రాన్స్ లోని మధ్యధరా సముద్ర తీరం ఫ్రైజుస్ వద్ద వెలుగు చూసింది. చిన్నపాటి పర్యాటక విమానం సెస్నా 177 రకం ప్లెయిన్ ఇది. 

విమానంలో తల్లీ కూతుళ్లపై లైంగిక వేధింపులు.. ఎయిర్ లైన్స్ పై 2 మిలియన్ డాలర్ల దావా

ఎగురుతున్న సమయంలో విమానం ఇంజిన్ లో లోపం ఏర్పడింది. తీరానికి మరో 600 మీటర్ల దూరం ఉందనగా ఈ సమస్య మొదలయ్యింది.
పైలెట్ విమానాన్ని ఎలాగైనా తీరం వరకు తీసుకెళ్దాం అని ప్రయత్నించినా కుదరలేదు. దీంతో పైలట్ సముద్ర జలాల్లోనే అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ల్యాండ్ చేసేముందు సమాచారం అందించడంతో అత్యవసరర విభాగం సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.  

ఆ సమయంలో విమానంలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని సిబ్బంది రక్షించారు. ఫ్రైజుస్ బీచ్ లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ అత్యవసరంగా విమానం ల్యాండింగ్ చేయడం ద్వారా జనాలకి ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పైలట్ అనుకున్నాడు. దీంతో సమయస్ఫూర్తితో బీచ్ లో కాకుండా.. బీచ్ కి దగ్గరగా ఉన్న సముద్ర జలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశాడు.  

‘ఇలా చేయడానికి పైలెట్ కు ఎంతో నైపుణ్యం ఉండాలి. దీనికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి’ అని విమానంలోని ముగ్గురిని కాపాడిన సహాయక సిబ్బంది అన్నారు. ఈ ప్రమాదం తర్వాత విమానం పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios