Kuala Lumpur: కుండపోత వర్షాల కారణంగా మలేషియాలోని దక్షిణ జొహోర్ రాష్ట్రంలో దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా సింగ‌పూర్ కు స‌రిహ‌ద్దుగా ఉన్న ఆరు రాష్ట్రాల్లో దారుణ ప‌రిస్థితులు ఏర్పడ్డాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.  

Malaysia floods: మ‌లేషియాను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. భారీగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌ల సంభవించాయి. అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఇండ్లు, రోడ్లు వ‌ర‌ద‌నీటిలో మునిగిపోయియి. వ‌ర‌ద‌ల కార‌ణంగా వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కుండపోత వర్షాల కారణంగా మలేషియాలోని దక్షిణ జొహోర్ రాష్ట్రంలో దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా సింగ‌పూర్ కు స‌రిహ‌ద్దుగా ఉన్న ఆరు రాష్ట్రాల్లో దారుణ ప‌రిస్థితులు ఏర్పడ్డాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దక్షిణ జొహోర్ రాష్ట్రంలో రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పెట్టార‌నీ, గత వారంలో వ‌ర‌ద‌ల కార‌ణంగా నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. వారిని తాత్కాలిక సహాయ శిబిరాలకు తరలించారు. 

Scroll to load tweet…

తాము నవంబర్, డిసెంబర్ లో వ‌చ్చే వర్షాకాలాన్ని ఎదుర్కొవ‌డానికి ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్లమ‌నీ, ప్రతి ఇంటికి ఒక పడవ ఉండేది, కానీ ఇప్పుడు అనూహ్యమైన వాతావరణం కార‌ణంగా భారీ వ‌ర్షాలు కుర‌వ‌డం, వ‌ర‌ద‌ల ముంచెత్త‌డంతో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డ్డామ‌ని బాధిత కుటుంబాలు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నాయి. వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజల కోసం అధికారులు 200కు పైగా పునరావాస షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మలేషియాలో వరదలు అక్టోబర్- మార్చి మధ్య వార్షిక వర్షాకాలంలో సాధారణం, కానీ ఈ వారం కురిసిన వర్షం చాలా మంది జోహోర్ నివాసితులను నిరాశ్రయుల‌ను చేసింది.

జోహోర్ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం కావడం, కార్లు నీట మునగడం, ఇళ్లు దెబ్బతినడం జ‌రిగింద‌నీ, ఇంకా వ‌ర్షాలు ప‌డుతుండంట‌-వ‌ర‌ద‌ల కార‌ణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్న‌ద‌ని విప‌త్తు నిర్వ‌హ‌ణ అధికారులు తెలిపారు.

వరదలకు కారణమేంటి?

మలేషియాలో వార్షిక వర్షాకాలంలో అక్టోబర్-మార్చి మధ్య వరదలు సాధారణం. ఇవి తరచుగా సామూహిక తరలింపులు, మరణాలకు కారణమవుతాయి. అయితే, ప్రస్తుత వరదలు దాని తీవ్రతలో అసాధారణమైనవనీ, విపత్తులో వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాలు ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయని కొందరు పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. మలేషియా నేచర్ సొసైటీ అధ్యక్షుడు విన్సెంట్ చౌ ఫ్రెంచ్ ఎఎఫ్ పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ, 1969 తర్వాత జోహోర్ ను తాకిన వరదలు అత్యంత ఘోరమైనవని చెప్పారు. ఇప్పుడు వాతావ‌ర‌ణంలో అనూహ్య మార్పుల కార‌ణంగా ఇలాంటి ప‌రిస్థితులు వస్తున్నాయని అభిప్ర‌యాప‌డ్డారు. 

పర్యావరణ సంస్థ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ మలేషియా అధ్యక్షురాలు మీనాక్షి రామన్ మాట్లాడుతూ.. భారీ వరదలు మానవులకు భారీ నష్టం కలిగించాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల ఎగువ ప్రాంతాల్లో అడవులు, భూ ప్రక్షాళన వల్ల నదులు, మురుగు కాల్వలు నేల కోతకు గురవుతున్నాయని, పెరుగుతున్న వర్షపాతాన్ని అవి నియంత్రించలేవని ఆమె అన్నారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాలను అతిగా కాంక్రీట్ చేయడం వల్ల కూడా నీరు పొంగిపొర్లుతున్న‌ద‌ని అన్నారు. నీరు భూమిలోకి ఇంకిపోయే ప‌రిస్థితులు లేకుండా పోవ‌డం కూడా ఒక కార‌ణంగా చెప్పారు. కాగా, ఏప్రిల్ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.