వాషింగ్టన్: వచ్చే ఏడాది ఆరంభంలోనే కరోనా కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌసీ అభిప్రాయపడ్డారు.

శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రథమంలో వ్యాక్సిన్ ను కచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. టీకా ఆవిష్కరణ ప్రక్రియన వచ్చే ఏడాదిలోపుగానే పూర్తి చేయాలన్నారు. అంతకంటే ఎక్కువ సమయం తీసుకోవద్దన్నారు.

వచ్చే ఏడాదిలోపుగా కరోనాకు వ్యాక్సిన్ రాకపోతే మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఏదాదిలోపుగా ప్రపంచాన్ని సాధారణస్థితికి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఈ ఏడాది నవంబర్ లో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు. కానీ సాధరణ ప్రజలకు వ్యాక్సిన్ చేరడానికి 2021 ఆరంభం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ సురక్షితమైందో , ప్రభావితంగా పనిచేస్తోందో కూడ పరిశీలించిన తర్వాతే దానిని ప్రజలకు అందించాలని  రష్యా టీకాపై ఆయన వ్యాఖ్యలు చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతురు ఈ వ్యాక్సిన్ ను వేయించుకొంది. రష్యా విడుదల చేసిన వ్యాక్సిన్ పై ప్రపంచంలోని పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.  ఈ టీకా గురించి ప్రపంచంలోని పలు దేశాలు, నిపుణులు లేవనెత్తిన అంశాలను రష్యా కొట్టిపారేసింది. దేశంలోని ప్రజలకు ఈ టీకాను వేయించాలని ఆ దేశం ఆలోచిస్తోంది.