ఓ తల్లి తన కూతురి వేళ్లు కొరుక్కు తింది.. అంతేనా ఆ తినే వీడియోను ఇన్ స్ట్రాగ్రాంలో షేర్ చేసింది. ఇంత కృరత్వం ఏంటీ.. ఆమెను అలా ఎలా వదిలేశారు.. కన్నకూతురినే ఇంతలా హింసించిందా? ఆమె తల్లా, రాక్షసా? ఇదే కదా మీ మనసులో అనుకుంటుంది.. 

అయితే ఆ తల్లి నిజంగా తన కూతురి వేళ్లను కొరుక్కుతిన లేదు. కూతురి రియాక్షన్‌ చూద్దామని తిన్నట్లు నటించిందంతే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన ఓ మహిళ తన కూతురు జోషఫైన్‌ చార్లీ వేళ్లను  నోట్లో పెట్టుకుని కొరికి తిన్నట్లు నటించింది. అయితే తన చేతి వేళ్లను చూసుకున్న చార్లీ నిజంగా తల్లి వాటిని తిన్నట్లు ముఖం పెట్టింది. వెక్కివెక్కి ఏడ్చింది. 

సదరు మహిళ ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘తన వేళ్లు తిన్నందుకు చార్లీ ఇప్పటికీ నాపై కోపంగా ఉంది’’ అంటూ హెడ్డింగ్ కూడా పెట్టింది. 

డిసెంబర్‌ 13న షేర్‌ అయిన ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్, పదుల సంఖ్యలో కామెంట్లు‌ సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ఈ పిల్ల మరీ అమాయకురాలిలా ఉందే!.. నువ్వేం తల్లివి చంటిపిల్లను అలా ఏడిపించొచ్చా?.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.