Asianet News TeluguAsianet News Telugu

నష్టాల్లో కూరుకుపోయి.. అమ్ముడుపోయిన ప్రఖ్యాత "టైమ్" మ్యాగజైన్

టైమ్ మ్యాగజైన్.. ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటి.. ఈ మ్యాగజైన్‌లో తమ గురించి వార్తలు రావాలని కోరుకోని సెలబ్రిటీలు ఉండరు. అటువంటి కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయింది. 

time magazine sold
Author
New York, First Published Sep 17, 2018, 2:27 PM IST

టైమ్ మ్యాగజైన్.. ప్రపంచంలోని అత్యంత పురాతన వార్తాపత్రికల్లో ఒకటి.. ఈ మ్యాగజైన్‌లో తమ గురించి వార్తలు రావాలని కోరుకోని సెలబ్రిటీలు ఉండరు. అటువంటి కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో నిర్వాహణా భారం ఎక్కువై అమ్మకానికి ఉంచారు..

దీనిలో భాగంగా టైమ్ మ్యాగజైన్‌ను రూ.1378.92 కోట్లకు ప్రముఖ  క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సేల్స్‌ఫోర్స్ కో ఫౌండర్ మార్క్ బెనియాఫ్ దంపతులు టైమ్ మ్యాగజైన్‌ను కొనుగోలు చేశారు. అయితే బెనియాఫ్ దంపతులు దీనిని వ్యక్తిగతంగా కొనుగోలు చేశారు.

దీనికి సేల్స్‌ఫోర్స్‌కు ఎలాంటి సంబంధం లేదని మెరిడెత్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. పత్రికల్లో ప్రకటనలు తగ్గిపోవడంతో టైమ్ సహా చాలా మ్యాగజైన్‌లకు ఆర్థిక ఇబ్బందులు ఎదురువుతున్నాయి. యాలే యూనివర్సిటీకి చెందిన హెన్నీ లూస్, బ్రటన్ హాడెన్ ఈ టైమ్ మ్యాగజైన్‌ను 1923లో ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios