సారాంశం

డోర్ బెల్ కొట్టి విసిగించారని ముగ్గురు టీనేజర్లను కారు యాక్సిడెంట్ చేసి చంపిన భారతీయ సంతతి వ్యక్తిని న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. 

న్యూయార్క్ : కాలింగ్ బెల్ మోగించి.. కనబడకుండా పారిపోవడం..  చిన్నపిల్లలు చేసే అల్లరిలో ఓ భాగం. అపార్ట్మెంట్లలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి.  ఇలాంటివి అనేకమందికి అనుభవంలోకి వచ్చిన ఘటనలే. ఆ సమయంలో చిరాకు పడతాం.. ఓ సారి కాపుకాసి బెదిరిస్తాం.. అంతటితో ఆగిపోతుంది. అయితే అమెరికాలో ఓ వ్యక్తి మాత్రం ఇలా తనను ఆటపట్టించిన ముగ్గురు కుర్రాళ్లను దారుణంగా హత్య చేశాడు. అతను భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం ఇక్కడ గమనార్హం.

అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణ ఘటన వెలుగు చూసింది. రాత్రిపూట కాలింగ్ బెల్ కొట్టి ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ వ్యక్తిని ఆటపట్టించారు. ఆ ముగ్గురు కుర్రాళ్లను హత్య చేశాడో వ్యక్తి. ఈ దారుణానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తి దోషిగా తేలాడు.ఈ ఘటన 2020 జనవరి 19న జరిగింది. కాగా, ఈ ఘటన తర్వాత దీనికి సంబంధించిన కేసులో అనురాగ్ చంద్ర అనే రివర్ సైడ్ కౌంటింగ్ నివాసి మీద నిందితుడిగా కేసు ఫైలయింది. అతడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది.

16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్.. వెంటనే అత్తకు ప్రమోషన్..

అతడిని పట్టుకున్న తర్వాత విచారించగా కొందరు టీనేజర్లు తమ ఇంటి డోర్ బెల్ ను పదే పదే మోగించారని…తనను ఆ విధంగా ఆటపట్టించారని అతను తెలిపాడు. ఆ సమయంలో తాను మద్యం మత్తులో ఉండడంతో.. విసుకు చెందానని.. పదేపదే బెల్లు మోగిస్తూ ఆటపట్టించడంతో తన కుటుంబ సభ్యుల భద్రత గురించి భయపడ్డానని అనురాగ్ చంద్ర విచారణలో తెలిపాడు.

దీంతోపాటు.. డోర్ బెల్ మోగించిన తర్వాత తన వీపు మీద కొట్టి.. కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర కోపానికి లోనైన తాను అలా ఎందుకు చేశారని నిలదీయడానికి వారి వెనక కారులో ఫాలో అయ్యానని చెప్పాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన కారు వారి కారును ఢీ కొట్టిందని  తెలిపాడు. ఇలా ఢీ కొట్టడంతో ఆ కారు చెట్టుకు గుద్దుకుని యాక్సిడెంట్ అవ్వడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని  తేలింది. ఈ కేసులో ముగ్గురు టీనేజీ యువకుల మరణానికి కారణమైన అనురాగ్ చంద్రకు పెరోల్ కు అవకాశం లేకుండా యావజీవ శిక్ష పడొచ్చని స్థానిక మీడియా పేర్కొంటుంది.