అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.. వారం కిందట పాఠశాలలో విద్యార్ధులపై జరిగిన కాల్పుల ఘటనను మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌‌లోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ష్రెవె 4000 బ్లాక్‌లోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇంటి ముందు ఓ వ్యక్తి, మరో నలుగురు తుపాకీ గాయాలతో కనిపించారు.

వీరిలో ముగ్గురు అప్పటికే మరణించగా.. మరో ఇద్దరు కొన ఊపిరితో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వీరంతా 20 నుంచి 30 ఏళ్లలోపు నల్లజాతీయులు కావడంతో జాత్యాంహర దాడిగా పోలీసులు భావిస్తున్నారు.