దేశం పరువు తీశారు.. సింగపూర్‌లో లైంగిక వేధింపులు.. ముగ్గురు భారతీయ అరెస్టు..
సింగపూర్‌లో వేర్వేరు లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలెదుర్కొంటున్న ఆరుగుర్ని అరెస్టు చేశారు. అందులో ఓ వైద్యుడు సహా ముగ్గురు భారతీయులు ఉన్నారని మీడియా నివేదిక తెలిపింది.

భారతదేశం పరువు తీశారు. దేశం కానీ దేశం వెళ్లి.. అక్కడ యువతులపై లైంగిక వేధింపులు గురించిన భారతీయ సంతతికి చెందిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్‌లో వేర్వేరు వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇందులో ఓ వైద్యుడు సహా ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. సింగపూర్ కోర్టులు సాధారణంగా ఒకే విధమైన నేరానికి సంబంధించిన అనేక కేసులను ఒకే సారి స్వీకరించడం. సమయాన్ని ఆదా చేసేందుకు ఉమ్మడిగా వారిపై అభియోగాలను రూపొందించడం ఆచారం.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అభియోగాలు ఎదుర్కొంటున్న భారతీయుల్లో వృత్తిరీత్యా వైద్యుడు ధీరజ్ ప్రేమ్ ఖియాతానీ (35), హర్దీరన్ సింగ్ రంధావా (29), మెల్విందర్ సింగ్ గుర్మిత్ సింగ్ (31)ఉన్నారు. వీరితో పాటు పాకిస్తాన్ సంతతికి చెందిన బట్ మహ్మద్ అబ్దుల్లా, చైనా చెందిన సింగపూర్ వాంగ్ షిటావో (49), స్పెన్సర్ టాన్ పెంగ్ చువా (58)పై అభియోగాలు నమోదు చేయబడ్డాయి.
మహిళపై వేధింపుల ఆరోపణలు
స్టార్క్ మెడికల్ ఇన్నోవేషన్స్‌తో సహా పలు సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న ఖియాతానీ జూన్ 25న సింగపూర్ పోస్ట్ హోటల్ మెరీనా బే సాండ్స్‌లో ఒక మహిళపై వేధింపులకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. శుక్రవారం కోర్టు విచారణ అనంతరం అతని కేసు అక్టోబర్ 25కి వాయిదా పడింది. మరోవైపు.. 30 ఏళ్ల మహిళను వేధించినట్లు హర్దిరన్ సింగ్ రంధావాపై ఆరోపణలు వచ్చాయి. అతని ఆరోపించిన నేరాన్ని సంబంధించిన ఆధారాలను కోర్టు పరీశీలిస్తోంది. ఇదిలా ఉంటే.. మల్వీందర్ గుర్మీత్ సింగ్‌పై రెండు వేధింపుల కేసులు నమోదయ్యాయి.
జెండాను అవమానించాడు
ఇదిలా ఉంటే.. సింగపూర్ జెండాను అవమానించినందుకు, కాఫీ షాప్‌లో కస్టమర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. సింగపూర్ జాతీయ జెండాను అవమానించారని ఆ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడింది. ఆ తర్వాత నిందితులు రెండు వారాలు జైలులో ఉండాల్సి ఉంటుంది.
ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. జూలై నెలలో భారతీయ సంతతికి చెందిన నిందితులు మరొక కాఫీ షాప్‌లోని వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో నిందితుడికి ఐదు రోజుల జైలు శిక్ష పడింది. సెప్టెంబర్ 5న నిందితుడు సింగపూర్ జాతీయ జెండాను అగౌరవపరిచినట్లు తేలిందని స్టేట్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ టింగ్ న్గే కాంగ్ తెలిపారు. అదే సమయంలో కాఫీ షాప్‌లో ఉన్న కస్టమర్లతో కూడా దురుసుగా ప్రవర్తించాడు. అక్కడున్న వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. నిందితుడిని అదుపులో తీసుకోవాలని ప్రయత్నించిన పోలీసుల పట్ల కూడా అతను దురుసుగా ప్రవర్తించాడు.
సింగపూర్ చట్టం ఏం చెబుతోంది?
సింగపూర్ చట్టం ప్రకారం.. పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడిన వారికి సింగపూర్ డాలర్ 2,000 వరకు జరిమానా విధించవచ్చు. నేరస్థులకు గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష లేదా సింగపూర్ డాలర్లు 2,000 వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి.