Asianet News TeluguAsianet News Telugu

suicide blast: ఆత్మాహుతి దాడి.. ముగ్గురు చిన్నారులు, మ‌రో ముగ్గ‌రు సైనికులు మృతి !

Pakistan suicide blast: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్‌లను వేరుచేసే పర్వత సరిహద్దు చాలా కాలంగా తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. భ‌ద్ర‌తా బ‌లగాల నుంచి త‌ప్పించుకోవ‌డానికి పోరస్ సరిహద్దును తీవ్ర‌వాదులు ఉపయోగిస్తున్నారు.
 

Three children, three soldiers killed in Pakistan suicide blast
Author
Hyderabad, First Published May 15, 2022, 3:59 PM IST

Pakistan : పాకిస్తాన్ బాంబుల మోత‌తో మ‌రోసారి దద్ద‌రిల్లింది. ఆత్మ‌హుతి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకెళ్తే.. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలో సైనిక వాహనంపై ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పిల్లలు మరియు ముగ్గురు సైనికులను చ‌నిపోయార‌ని అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. ప‌లువురు గాయ‌ప‌డ్డార‌ని కూడా పేర్కొన్నారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్‌లను వేరుచేసే పర్వత సరిహద్దు చాలా కాలంగా తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. భ‌ద్ర‌తా బ‌లగాల నుంచి త‌ప్పించుకోవ‌డానికి పోరస్ సరిహద్దును తీవ్ర‌వాదులు ఉపయోగిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌కు ఆగ్నేయంగా 26 కిలోమీటర్లు (16 మైళ్లు) దూరంలో ఉన్న ఉత్తర వజీరిస్థాన్‌లోని మిరాన్ షా సమీపంలోని చిన్న మార్కెట్‌లో శనివారం సాయంత్రం ఆత్మాహుతి బాంబర్ త‌న‌ను తాను పేల్చుకున్నాడు. ఆ ప్రాంతాల్లో జ‌నాభా అధికంగా ఉండ‌టంతో ఈ దాదిలో ముగ్గురు చిన్నారులు, మ‌రో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని  పాకిస్తాన్ సైన్యం తెలిపింది. "భద్రతా బలగాల వాహనం అటుగా వెళ్లినప్పుడు బాంబర్ కాలినడకన వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు" అని స్థానిక ప్రభుత్వ అధికారి తెలిపారు. అమాయక పిల్లలను హతమార్చినవారు మానవత్వానికి, ఇస్లాంకు శత్రువులు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

"ఈ అనాగరికులను మరియు వారిని ప్రోత్సహించే వారిని వేటాడే వరకు మేము విశ్రాంతి తీసుకోము" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ దాది గురించి ఇంకా ఏ మిలిటెంట్ గ్రూపు ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే, పాకిస్తాన్ తాలిబాన్ -- తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ ప్రాంతంలో దాడులకు కుట్ర పన్నిన సుదీర్ఘ చరిత్ర ఉందని అధికారులు పేర్కొన్న‌రు. ఇటీవలి పాకిస్తానీ చరిత్రలో  అత్యంత దారుణ మార‌హోమాల‌కు ఈ మిలిటెంట్ గ్రూప్ బాధ్య‌త‌వ‌హిస్తూ.. ప్ర‌క‌ట‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, పెషావర్‌లో దాదాపు 150 మంది పాఠశాల విద్యార్థులపై క్రూరమైన ఊచకోత తర్వాత.. 2014 సైనిక దాడి ఉద్యమాన్ని అణిచివేసింది.. దాని మిగిలిన సభ్యులను సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్తాన్‌లోకి తరిమికొట్టింది.

కాబూల్‌లో ఆఫ్ఘన్ తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఇస్లామాబాద్ తన సరిహద్దులో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం అందిస్తున్నట్లు ఎక్కువగా ఫిర్యాదు చేసింది. అయితే, శాంతి చర్చలను సులభతరం చేసేందుకు కాల్పుల విరమణ సమయంలో శనివారం పేలుడు సంభవించ‌డం గ‌మనార్హం. ఇదిలావుండ‌గా, ఆదివారం నాడు ఆఫ్ఘన్ సరిహద్దుకు 30 కిలోమీటర్ల (19 మైళ్ళు) దూరంలో ఉన్న వాయువ్య నగరం పెషావర్‌లో ఇద్దరు ముష్కరులు మోటర్‌బైక్‌పై వెళుతున్న ఇద్దరు సిక్కు దుకాణదారులను కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ముష్క‌రుల కాల్పుల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక్క‌డే చ‌నిపోయార‌నీ, దాడి చేసిన వ్య‌క్తులు త‌ప్పించుకున్నార‌ని స్థానిక పోలీసు చీఫ్ ముహమ్మద్ ఇజాజ్ ఖాన్  వెల్ల‌డించారు. 

అలాగే, గురువారం రాత్రి కూడా దేశ ఆర్థిక రాజధాని కరాచీలో పేలుడు సంభవించింది. నగరంలో రద్దీగా ఉండే సద్దార్ ప్రాంతంలో ఈ పేలుడు జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా.. 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios