కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం వణికిపోవడానికి కారణం చైనీయులే. ఇందులో తమ తప్పు లేదని చైనా వాదిస్తున్నప్పటికీ, కోవిడ్‌కు పుట్టినిల్లు చైనాయేనని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు.

ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఫేస్ మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్‌లను ప్రజలు ఆయుధాలుగా చేసుకున్నారు. మనదేశంతో పాటు ప్రస్తుతం ప్రపంచమంతా ఇదే ఫాలో అవుతున్నారు.

మనదగ్గరే ఇలా ఉంటే కరోను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలోని వుహాన్‌లో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అక్కడ అలాంటి భయాలేవీ కనిపించడం లేదు. నగరంలోని మాయా బీచ్ పార్క్‌లో ఆదివారం ఓ మ్యూజిక్ పార్టీ జరిగింది.

వందల మంది నీళ్లలో ఆటలాడుతూ, భౌతిక దూరాన్ని బుగ్గి చేస్తూ, ఫేస్ మాస్క్ ఊసే మరుస్తూ జలకాడారు. ఒకరినొకరు చాలా సన్నిహితంగా మెలుగుతూ, గుంపులుగా ఎంజాయ్ చేశారు.

కరోనాను చాలా తేలిగ్గా తీసుకుని మళ్లీ సాధారణ జీవనంలోకి తొంగి చూస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ కూడా పార్టీలో మాస్క్ ధరించకపోవడం గమనార్హం. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

కరోనాను పరిచయం చేసి, ప్రపంచాన్ని నాశనం చేస్తూ మీరు మాత్రం ప్రశాంతంగా గడుపుతన్నారంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. కాగా వుహాన్‌లో గతేడాది తొలిసారి కరోనా కేసు నమోదైంది.

తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అక్కడ లాక్‌డౌన్ విధించారు. అన్ని రకాల ఆంక్షలతో పాటు వాటర్ పార్క్‌పైనా నిషేధం విధించారు. అయితే ఆంక్షల సడలింపులో భాగంగా జూన్ నెలలో మళ్లీ ఈ పార్క్ తెరచుకుంది.

కానీ ప్రజల్లో భయం వుండటంతో ఆదరణకు నోచుకోవడం లేదు. దీంతో ఈ పార్క్ నిర్వాహకులు... ఆకర్షణీయమైన పథకాలను  ప్రవేశపెడుతున్నారు. మహిళా కస్టమర్లు రుసుములో సగం చెల్లిస్తే సరిపోతుందని ఆఫర్ ప్రకటించారు. దీనికి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున పార్క్‌ వద్దకు పోటేత్తారు.