Asianet News TeluguAsianet News Telugu

పిల్లాడితో సహా, కారు దొంగతనం.. తిరిగొచ్చి కన్నతల్లికి క్లాస్ పీకాడు.. !

దొంగల్లోనూ మంచిదొంగలుంటారు. తాము దొంగిలించాలనుకున్నది కాక వేరే ఏదీ ముట్టికోని వారు కొందరైతే.. దొంగతనానికి వెళ్లిన చోట మరేదో అహింస జరుగుతుంటే అడ్డుకుని బాగుచేసేవాళ్లు మరికొందరు. దొంగిలించిన సొమ్మును పేదవారికి పంచి పెట్టే రాబిన్ హుడ్స్ ఇంకొందరు. 

Thief U turns Car After Finding Child Inside, Lectures Mother On Parenting - bsb
Author
Hyderabad, First Published Jan 20, 2021, 4:41 PM IST

దొంగల్లోనూ మంచిదొంగలుంటారు. తాము దొంగిలించాలనుకున్నది కాక వేరే ఏదీ ముట్టికోని వారు కొందరైతే.. దొంగతనానికి వెళ్లిన చోట మరేదో అహింస జరుగుతుంటే అడ్డుకుని బాగుచేసేవాళ్లు మరికొందరు. దొంగిలించిన సొమ్మును పేదవారికి పంచి పెట్టే రాబిన్ హుడ్స్ ఇంకొందరు. 

అయితే ఈ దొంగ వేరు.. దొంగిలించిన కారులో చిన్నారి కనిపిస్తే... రోడ్డు మీద వదిలేయకుండా, అమ్మిపారేయకుండా ఎంచక్క తీసుకొచ్చి తల్లికి అప్పజెప్పాడు.. ఆశ్చర్యంగా ఉందా.. నిజంగా నిజం...

అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రం పోర్ట్‌ల్యాండ్‌లో శనివారం నాడు ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకును తీసుకుని కారులో షాపుకు వెళ్లింది. కారును రన్నింగ్‌లో ఉంచి, అందులో చంటిపిల్లాడిని ఒంటరిగా వదిలేసి పాలు, మాంసం కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లింది. 

ఇంతలో అక్కడే ఉన్న ఓ దొంగ రన్నింగ్ లో ఉన్న కారెక్కి ఎంచక్కా ఎత్తుకెళ్లిపోయాడు. అయితే కొంత దూరం వెళ్లాక కారులో పసిపిల్లాడు ఉన్నాడని గుర్తించి యూటర్న్‌ తీసుకుని తిరిగి అదే షాపుకు దగ్గరకు వెళ్లాడు. కారుకోసం వెతుకుతున్న తల్లికి బుడతడిని అందించాడు. అంతేకాదు బుడ్డోడిని అలా వదిలేసి పోతావా? అని సదరు మహిళకు ఆవేశంతో క్లాస్‌ పీకాడు. 

అంతేనా.. అంటే కాదు.. నిర్లక్క్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులకు పట్టిస్తానంటూ బెదిరించి చిన్నోడిని ఆమె చేతుల్లో పెట్టాడు. తల్లి కొడుకును ఎత్తుకుని మురిసిపోయి, ఇతడు మంచి దొంగే అనుకునేలోపే తిరిగి అదే కారులో ఉడాయించాడు. 

అయితే చంటోడిని తల్లికి అప్పజెప్పినందుకు పోలీసులు అతడిని నిజాయితీ గల దొంగగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే తిరిగా ఆ కారును గుర్తించి మహిళకు అప్పజెప్పగా ప్రస్తుతం దొంగ జాడ కోసం గాలింపు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios