పోలీసులకు సర్వీస్ ఇవ్వడాన్ని అమెరికాలో ని రీమ్స్ కాలిఫోర్నియా అనే రెస్టారెంట్ నిషేధించింది. యూనిఫాం, ఆయుధాన్ని కలిగి ఉన్న పోలీసులకు, ఇతరులకు ఫుడ్ సర్వ్ చేయకూడదని, సర్వీస్ ఇవ్వకూడదని ఓ విధానం రూపొందించుకుంది. దీనిపై అక్కడి పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
శాన్ ఫ్రాన్సిస్కో లోని ఓ రెస్టారెంట్ యూనిఫాంలో ఉన్న పోలీసులకు ఫుడ్ సర్వ్ చేయబోమని, సేవలు అందించబోమని తేల్చి చెప్పింది. దీనికి ఓ కారణాన్ని కూడా వెల్లడించింది. అయితే దీనిపై శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ తీరును నిరసిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టింది. మరి రెస్టారెంట్ ఎందుకు అలా చేస్తోంది ? అసలు కారణమేంటి ? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అమెరికాలోని అరబ్ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్లు, బేకరీల రీజనల్ చైన్ అయిన రీమ్స్ కాలిఫోర్నియా తన కొత్త సర్వీసు విధానాన్ని రూపొందించుకుంది. దాని ప్రకారం ఆయుధాలు కలిగి ఉన్న ఎవరికీ అందులో సేవలు అందించరు. ఫుడ్ ను సర్వ్ చేయరు. అయితే ఈ విషయం తెలియని ఓ పోలీసు అధికారి ఒకరు ఆగస్టు 24వ తేదీన యూనిఫాంలో ఆ రెస్టారెంట్ కు వెళ్లారు. ఆయన ఫుడ్ ను ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆయనకు సర్వీస్ ఇచ్చేందుకు ఆ రెస్టారెంట్ నిరాకరించింది.
ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టింది. ‘‘పోలీసులకు అనుమతి లేదు. బేకరీ చైన్ రీమ్స్ కొత్త విధానం ఇది. మా అధికారి ఒకరు గత వారం ఆ రెస్టారెంట్ కు వెళ్లారు. అయితే యూనిఫాంలో ఉన్నారనే కారణంతో వారు సర్వీస్ ను నిరాకరించారు. ఆయుధాన్ని కలిగి ఉన్న వారికి, యూనిఫాంలో ఉన్న ఎవరికీ సర్వీస్ ఇవ్వబోమని రీమ్స్ స్పష్టం చేసింది. ఇది అమెరికా మిలిటరీ సభ్యులు కూడా వర్తించే అవకాశం ఉంది.’’ అని ఆ అసోసియేషన్ అంచనా వేసింది.
ఈ పోస్టులో ఆ రెస్టారెంట్ బోర్డు చూపిస్తూ.. పోలీసు అసోసియేషన్ ఇలా పేర్కొంది. ‘‘మా అధికారులకు సేవ చేయాలని రీమ్ లేదా మతోన్మాద విధానం ఉన్న ఏ సంస్థనూ ఆడగడం లేదు. మేము వారిని వారి వివక్షాపూరిత విధానాన్ని సొంతం చేసుకోవాలని, డ్యూటీలో ఉన్నప్పుడు, లేనప్పుడూ మీ సంస్థలో డబ్బు ఖర్చు చేయవద్దని మాకు తెలిసే విధంగా ఓ బోర్డును పెట్టాలని కోరుతున్నాం. వారి కోసం మేమే ఒక బోర్డు డిజైన్ చేసే స్వేచ్ఛ తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ లో ‘పోలీసులకు అనుమతి లేదు’ అని సూచించేలా ఓ డిజైన్ కూడా పోలీసు అసోసియేషన్ ఉంచింది.
కాగా.. ఈ ఆరోపణలపై రీమ్స్ కాలిఫోర్నియా రెస్టారెంట్ స్పందిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో గేట్ కు ఒక ప్రకటన ఇచ్చింది. ‘‘మా కమ్యూనిటీలలో సామాజిక, జాతి న్యాయాన్ని పెంపొందించడానికి రీమ్స్ కు లోతైన నిబద్ధత ఉంది. మా సిబ్బంది, కస్టమర్లకు సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించడం కూడా ఇందులో ఉంది. అందుకే తుపాకీ హింస పెరుగుతున్న ఈ సమయంలో ముఖ్యంగా రంగు, యువత, క్వీర్ వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. అంందుకే మా రెస్టారెంట్లో తుపాకులను నిషేధించే కఠినమైన విధానాన్ని రూపొందించాం. ఇది మమ్మల్ని సురక్షితంగా ఉంచుతుందని మేము నమ్ముతున్నాం’’ అని పేర్కొంది.
