సోమవారం నుంచి కనిపించకుండాపోయిన హెలికాప్టర్ ఎవరెస్టు శిఖరం వద్ద కుప్పకూలింది. ఇందులో మొత్తంగా ఆరుగురు ప్రయాణికులు ఉండగా..ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. 

నేపాల్ లో నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన హెలికాప్టర్ కథ విషాదాంతం అయ్యింది. ఎవరెస్టు శిఖరం వద్ద అది కుప్పకూలి కనిపించింది. మౌంట్ ఎవరెస్ట్ ప్రాంతానికి సమీపంలో మనాంగ్ ఎయిర్ కు చెందిన టెయిల్ నంబర్ ఎన్ ఏ-ఎంవీప్రైవేట్ కమర్షియల్ హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు ధృవీకరించారు. సోలుఖుంబు జిల్లాలోని సుర్కే విమానాశ్రయం నుంచి ఉదయం 10:04 గంటలకు ఐదుగురు మెక్సికన్ పౌరులు సహా ఆరుగురు ప్రయాణికులతో హెలికాప్టర్ ఖాట్మండుకు బయలుదేరింది.

ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం.. ఏమిటీ అవార్డు ? దాని ప్రత్యేకతలేంటంటే ?

ఉదయం 10:13 గంటలకు హెలికాప్టర్ 12,000 అడుగుల ఎత్తులో సంబంధాలు కోల్పోయిందని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (టిఐఎ) మేనేజర్ జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. అయితే మంగళవారం నేపాల్ లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో గల్లంతైన హెలికాప్టర్ ఆ దేశ తూర్పు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. హెలికాప్టర్లో ఐదుగురు మెక్సికన్ పౌరులు, పైలట్ చెట్ బి గురుంగ్ ఉన్నారు.

హెలికాప్టర్ లో ఉన్న ఆరుగురిలో ఐదుగురి మృతదేహాలు ప్రమాద స్థలంలో లభ్యమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ‘మై రిపబ్లిక్’ న్యూస్ పోర్టల్ తెలిపింది. మారుమూల పర్వత ప్రాంతమైన సోలుఖుంబు జిల్లాలోని లిఖుపికే రూరల్ మున్సిపాలిటీలోని లాంజురా ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది.

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర చొరబాటు భగ్నం.. టెర్రరిస్టును హతమార్చిన ఆర్మీ..

భారీ పేలుడుతో హెలికాప్టర్ కూలిపోయిందని, ప్రమాద స్థలంలో మంటలు కనిపించాయని స్థానికులు తనకు సమాచారం ఇచ్చారని ఓ అధికారి తెలిపినట్టు ‘ఖాట్మండు పోస్ట్’కు తెలిపారు. చిహందండా వద్ద కూలిపోయిన హెలికాప్టర్ ను స్థానికులు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. లమ్జురా పాస్ ప్రాంతంలో ఉదయం 10:12 గంటలకు హెలికాప్టర్ చివరి ప్రదేశంగా మనాంగ్ ఎయిర్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ మేనేజర్ రాజు న్యూపానే తెలిపారు. దీంతో ఆ ప్రాంతానికి స్థానిక పోలీసులను పంపించామని పేర్కొన్నారు. 

ప్రమాద స్థలాన్ని గుర్తించడానికి గతంలో పంపిన రెండు హెలికాప్టర్లు ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి రావాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. అంతకు ముందు టీఐఏ అధికార ప్రతినిధి టేక్నాథ్ సితౌలా వార్తా వెబ్ సైట్ తో మాట్లాడుతూ.. ‘‘మనాంగ్ ఎయిర్ కు చెందిన హెలికాప్టర్ కాంటాక్ట్ లో లేదని, లామ్జురా పాస్ కు చేరుకున్నప్పుడు టవర్ తో ఎలాంటి సందేశమూ లేదని, హెలికాప్టర్ కు వైబర్ లో ‘హలో’ సందేశం మాత్రమే వచ్చిందని, గాలింపు కొనసాగుతోంది’’ అని నివేదించారు. 

రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులు.. కేసును విచారించి అతడిని శిక్షించాలి : ఢిల్లీ పోలీస్ ఛార్జిషీట్

1997లో స్థాపించిన ‘మనాంగ్ ఎయిర్’ ఖాట్మండు కేంద్రంగా పనిచేసే హెలికాప్టర్ ఎయిర్ లైన్స్. నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ రెగ్యులేషన్ కింద నేపాల్ భూభాగంలో వాణిజ్య విమాన రవాణాలో హెలికాప్టర్లను నడుపుతోంది. ఈ సంస్థ చార్టర్డ్ సేవలు, సాహస విమానాలతో పాటు విహారయాత్రల కోసం కూడా హెలికాప్టర్ సేవలను అందిస్తుంది.