Asianet News TeluguAsianet News Telugu

నువ్వు దేవుడు సామీ.. 100 అడుగుల ఎత్తులో వేలాడుతున్నచిన్నారిని ర‌క్షించిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్..

తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారిని కాపాడారు. 100 అడుగుల ఎత్తులో ఉన్న కిటికీ గ్రిల్ ను పట్టుకొని వేలాడుతున్న పాపను రక్షించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

The person who saved the child hanging at a height of 100 feet.. Video Viral..
Author
New Delhi, First Published May 16, 2022, 3:50 PM IST

100 అడుగుల ఎత్తులో వేలాడుతున్న ఓ చిన్నారిని కాపాడి రియ‌ల్ హీరో గా మారిపోయాడు ఓ వ్య‌క్తి. త‌న ప్రాణాల‌కు తెగించి, ఓ పెద్ద సాహ‌సం చేసి ఆ చిన్నారికి వందేళ్ల జీవితాన్ని ప్ర‌సాదించాడు. ప‌సి పాప‌ను కాపాడిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్లు అత‌డిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. 

అది కజకిస్థాన్ రాజ‌ధాని నూర్- సుల్తాన్. గ‌త బుధ‌వారం ఆ ప‌ట్ట‌ణంలోని ఓ పార్ట‌మెంట్ ప్లాట్ లో మూడేళ్ల చిన్నారిని వ‌దిలిపెట్టి త‌ల్లి షాపింగ్ కు వెళ్లింది. అయితే ఈ స‌మ‌యంలో పాప ఆడుకుంటూ కిటికీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఆ కిటికీ నేల నుంచి దాదాపు వంద అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ చిన్నారి కింద ఏముందో చూద్దామ‌నుకుందో ఏమో తెలీదు గానీ.. ఒక్క సారిగా కిటికీ నుంచి ప‌డబోయింది. అదృష్ట‌వ‌శాత్తూ ఆ కిటికీని ప‌ట్టుకుని ఆగిపోయింది. బ‌య‌ట నుంచి చూసే జ‌నాల‌కు ఆమె వేలాడుతూ క‌నిపించింది. అంద‌రి గుండె ఒక్క‌సారిగా ఆగిపోయినంత ప‌నైంది. కానీ అక్క‌డున్న ఎవ‌రికీ ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. వారు వెంట‌నే రెస్క్యూ సిబ్బందికి స‌మాచారం అందించారు. కానీ వారు అక్క‌డికి చేరుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది. 

బూస్టర్ డోసుల కంటే కూడా ఒమిక్రాన్‌తో ఎక్కువ రోగ నిరోధక శక్తి.. యూఎస్ వర్సిటీ అధ్యయనం సంచలనం

అదే స‌మ‌యంలో అటు నుంచి షోంటక్‌బావ్ సబిత్ అనే వ్య‌క్తి త‌న డ్యూటీకి వెళ్తున్నాడు. కింద జ‌నం గుమిగూడి ఉండ‌టం చూశాడు. ఏమైంద‌ని ద‌గ్గ‌రికి వెళ్లాడు. అక్క‌డికి వెళ్లి చూసి షాక్ అయ్యాడు. ఓపాప కిటికీ గ్రిల్ ని ప‌ట్టుకొని వేలాడుతోంది. దీంతో మ‌నోడు ఏం ఆలోచించ‌లేదు. వేగంగా ఆ అపార్టెమెంట్ లోకి వెళ్లిపోయాడు. ఆ కిట‌కీ కింద ఉన్న మ‌రో కిటికీ ద్వారా తన ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి అయినా పాప‌ను ర‌క్షించాల‌నుకున్నాడు. ఆ కిటికీ మీద నిలబడి ఆ చిన్నారి కాళ్ల‌ను ప‌ట్టుకున్నాడు. ఆ పాప అప్ప‌టికే భ‌యంతో, ఓపిక‌తో గ్రిల్ ను ప‌ట్టుకొని ఉంది. చిన్నారి కుడికాలును గ‌ట్టిగా లాగి త‌న ఒడిలో ప‌డిపోయేలా చేసుకున్నాడు. త‌రువాత జాగ్ర‌త్త‌గా ఆమెను ర‌క్షించి కిటికీ ద్వారా లోప‌ల‌కు పంపించాడు. త‌రువాత అత‌డు కూడా లోప‌ల‌కు వెళ్లిపోయాడు.  ఇదంతా కింద ఉన్న జ‌నాలు టెన్ష‌న్ గా చూస్తు ఉన్నారు. కొంద‌రు వీడియో రికార్డ్ చేశారు. 

ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అత‌డిని నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. రియ‌ల్ హీరో అంటూ పొగ‌డారు. ఈ ఘ‌ట‌న త‌రువాత కజకిస్తాన్ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ఆ వ్యక్తిని ‘హీరో’గా అభివర్ణించింది. పసి పాపను రెస్క్యూ చేసి, వేగంగా కాపాడినందుకు అతనికి పతకాన్ని అందించింది.  ఆ చిన్నారిని ర‌క్షించేందుకు అత్యవసర పరిస్థితుల విభాగంలోని సబ్‌డివిజన్‌లు 7 మంది సిబ్బందిని, 2 వాహనాలను ఘటనా స్థలానికి పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అవి అక్క‌డికి చేరుకునేలోపే షోంటక్‌బావ్ సబిత్ కాపాడాన‌ని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios