Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. రెండు సార్లు ల్యాండ్ అయి, మళ్లీ పైకెగిరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం.. సోషల్ మీడియాలో వీడియో హల్ చల్

యూకే లో బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన ఓ విమానం ల్యాండ్ అయ్యేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కోరీ తుఫాను వల్ల వీస్తున్న బలమైన గాలులతో బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం రెండు సార్లు రన్ వేను తాకి తిరిగి గాలిలోకి ఎగిరింది. 

The British Airways plane that landed twice and took off again.. The video is going viral on social media.
Author
First Published Feb 2, 2023, 3:29 PM IST

బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం ల్యాండింగ్ అయ్యేందుకు నానా అవస్థలు పడింది. రెండు సార్లు రన్ వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించి చివరికి గాలిలోకి ఎగిరింది. దీంతో ప్రయాణికులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం హీత్రూ విమానాశ్రయంలోని రన్ వేపై పలుమార్లు భయంకరంగా ఊగుతూ, పక్కకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

కాకరేపుతున్న అదానీ అంశం.. పార్లమెంట్ లో చ‌ర్చ జ‌ర‌గాల్సిందేనంటున్న ప్ర‌తిప‌క్షాలు.. !

స్కాట్లాండ్ లోని అబెర్డీన్ నుంచి బయలుదేరిన ఈ విమానం యూకేలోని లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి బయలుదేరింది. అయితే కోరీ తుఫాను వల్ల యూకేలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు ఆ విమానం సాయశక్తులా పోరాడింది.

రాయిటర్స్ ట్వీట్ చేసిన వీడియోకు 1.5 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ  ఫుటేజీలో చివరి క్షణంలో విమానం ఆకాశంలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. కాగా.. ఘటన జరిగిన వెంటనే విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు సమాచారం.

సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు చేసిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఉపరాష్ట్రపతిపై కేసు.. ‘వారి బాధ్యతల నుంచి తప్పుకోవాలి

ఇదిలావుండగా.. ఈ ఏడాది జనవరిలో 72 మందితో ప్రయాణిస్తున్న యేతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నేపాల్ లోని పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ ప్రమాదం జరిగింది. విమానాలు సురక్షితంగా దిగేందుకు సహాయపడే వర్కింగ్ ల్యాండింగ్ మార్గదర్శక వ్యవస్థ విమానాశ్రయంలో లేదని తరువాత తేలింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios