ఓ మహిళను తన మాజీ బాయ్‌ఫ్రెండ్ లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆమె ప్రైవేటు ఫొటోలను అశ్లీల వెబ్‌సైట్లలో షేర్ చేసిన కేసులో జ్యూరీ బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచ్చింది. బాధితురాలికి 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లు (₹ 99,881,986,800.00) చెల్లించాలని ఆ మాజీ బాయ్‌ఫ్రెండ్ ను కోర్టు ఆదేశించింది.
ప్రపంచంలో ఎక్కడ కూడా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా ఓ మహిళను తన మాజీ బాయ్‌ఫ్రెండ్ లైంగిక వేధింపులకు గురిచేశారు.
ఆమె ప్రైవేటు ఫొటోలను అశ్లీల వెబ్‌సైట్లలో షేర్ చేసి.. మానసికంగా హింసించాడు. దీంతో ఆ సదరు మహిళ తొలుత పోలీసులకు ఆశ్రయించింది. కానీ, అక్కడ తనకు సరైన న్యాయం జరగలేదని భావించిన ఆ బాధితురాలు సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ను విచారించిన జ్యూరీ(న్యాయమూర్తుల బృందం) బాధిత మహిళకు 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లు (₹99,881,986,800.00) చెల్లించాలని ఆ మాజీ బాయ్‌ఫ్రెండ్ ను ఆదేశించింది. ఈ అమెరికాలోని షికాగోలో జరిగింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... అమెరికాకు చెందిన ఓ మహిళ (మొదటి పేరు DL అని మాత్రమే పేర్కొంది) ఆ మహిళ మార్క్వెస్ జమాల్ జాక్సన్ అనే వ్యక్తితో కలిసి 2016 సహాజీవనం చేస్తుంది. కానీ.. కొంతకాలం తరువాత అక్టోబర్ 2021న పరస్పర అంగీకారంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. మాజీ బాయ్‌ఫ్రెండ్ టర్చర్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె 2022లో తన మాజీ భాగస్వామిపై వేధింపుల కేసు పెట్టింది.
తన మాజీ ప్రియుడు తన నగ్న ఫోటోలను నకిలీ ట్విట్టర్, ఫేస్‌బుక్ , యూట్యూబ్ ప్రొఫైల్‌లలో షేర్ చేశాడని ఆరోపిస్తూ ఆ మహిళ ఏప్రిల్ 2022లో హారిస్ కౌంటీ సివిల్ కోర్టులో సివిల్ దావా వేసింది. అధికారికంగా విడిపోయిన తర్వాత.. నిందితులు ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అశ్లీల వెబ్‌సైట్లలో ఆమె చిత్రాలను పోస్ట్ చేశారు. తనకు సరైన న్యాయం జరగదనే అనుమానంతో ఆ మహిళ చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిందితుడి చర్యలతో మానసిక, లైంగిక వేధింపులకు గురవుతుందని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
నిందితుడు తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు డ్రాప్‌బాక్స్ ఫోల్డర్ ద్వారా ఫోటోల లింక్‌లను కూడా పంపాడు. నిందితుడిపై మహిళ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, ఆమె తల్లి ఇంట్లో ఉన్న కెమెరా సిస్టమ్‌కు కూడా యాక్సెస్ ఉందని ఆరోపించారు. నిందితుడు సదరు మహిళకు ఈ సందేశం పంపినట్లు సమాచారం
అయితే.. నిందితుడు కోర్టుకు హాజరుకానప్పటికీ.. అతని తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం(జ్యూరీ) .. మహిళను మానసిక వేదనకు గురి చేసిందుకు 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1600కోట్లు), ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) చెల్లించాలని జ్యూరీ నిందితుడికి ఆదేశించింది.
బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయమై స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ రినుంచి సరైన స్పందన లభించకపోవడంతోనే తాను సివిల్ అటార్నీని ఆశ్రయించినట్టు తెలిపింది.