Texas Road Accident: అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.  పశ్చిమ టెక్సాస్‌లో 13 ఏళ్ల బాలుడు.. అజాగ్ర‌త్త‌గా పికప్ ట్రక్కును నడుపుతూ.. ఎదురుగా వ‌స్తున్న వ్యాన్‌ను ఢీకొట్టాడు. దీంతో ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మృతులంద‌రూ న్యూ మెక్సికోకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ సౌత్‌వెస్ట్ గోల్ఫ్ జట్టు స‌భ్యులుగా గుర్తించారు.  

Texas Road Accident: అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మైనర్ యువకుడు అత్యుత్స‌హంతో.. అజాగ్రత్తగా ట్రక్ ను నడిపి మరో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో భారీ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఏళ్ల టెక్సాస్ మైనర్ బాలుడు, త‌న తండ్రితో క‌లిసి ట్రక్ ను నడిపాడు.  ఈ క్రమంలో.. ఆక‌స్మ‌త్తుగా.. ఎదురుగా వ్యాన్ రావ‌డంతో.. ఆ బాలుడు తన వాహనాన్ని అదుపు చేయలేక పోయాడు. దీంతో ఎదురుగా వ‌చ్చిన వాహనాన్ని వేగంగా ఢీ కొట్టాడు. దీంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించిన‌ట్టు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారంతా న్యూ మెక్సికో లోని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ వెస్ట్ గోల్ప్ జట్టులోని ఆరుగురు సభ్యులున్నట్లు పోలీసులు గుర్తించారు.  వాహనాన్ని నడుపుతున్న మైనర్ బాలుడుతో పాటు ప‌క్క‌నే ఉన్న అతని తండ్రి కూడా సంఘటన స్థలంలోనే చనిపోయిన‌ట్టు తెలిపారు. ప్రమాదం జరగగానే మైనర్ బాలుడు ట్రక్ కింద చిక్కుకున్నాడని తెలిపారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన మరో ఇద్దరు యూనివర్శిటీ ఆఫ్ సౌత్‌వెస్ట్ విద్యార్థులు, ఇద్దరు కెనడియన్ల పరిస్థితి విషమంగా ఉంది.  వీరిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

టెక్సాస్ చట్టాల ప్రకారం.. 21 ఏళ్లు పైబడిన వారు మాత్ర‌మే..లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలి.  ఆ మైన‌ర్ బాలుడు టెక్సాస్ చట్టాల‌ను అతిక్ర‌మించడాని పోలీసులు పేర్కొన్నారు.  రెండు వాహనాలు అతి వేగంతో ప్ర‌యాణించ‌డం వ‌ల్ల ఇంత‌టి ఘోర ప్ర‌మాదం జ‌రిగిందని అన్నారు. వాహనాలు ఢీకొనగానే.. ట్రక్ టైర్ ఊడిపోయి దూరంగా పడిపోయిందని పోలీసులు తెలిపారు.మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు .. అక్కడి సీసీ ఫుటేజీని ఆధారంగా ద‌ర్యాప్తు చేపట్టారు.