ఆక్ట్ ఇన్ స్పేస్ 2018 లో తెలుగుతేజాలు

telugu students participating  ACTInSpace2018
Highlights

ఆక్ట్ ఇన్ స్పేస్ 2018 లో తెలుగుతేజాలు
 

జర్మనీ రాజధాని బెర్లిన్ లో జరుగుతున్న  ఆక్ట్ ఇన్ స్పేస్ 2018 లో తెలుగుతేజాలు తమ సత్తా చాటుతున్నారు. దాదాపు 80 దేశాలు ఈ కాంపిటీషన్ లో పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఇందులో రీజనల్, నేషనల్ స్థాయిల్లో అర్హత సాధించిన క్యూటీ స్పేస్ ( QUANTUM TECHNOLOGY SPACE)  అనే తెలుగు విద్యార్థులు సభ్యులుగా గల టీమ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో విన్నర్ గా నిలవాలని తహతహలాడుతోంది.

అంతరిక్ష పరిశోదనల్లో క్వాంటమ్ టెక్నాలజీ  ఉపయోగం గురించి వారు రూపొందించిన వీడియో ప్రస్తుతం పోటీలో ఉంది. ఈ వీడియోకు ఎన్ని ఎక్కువ లైక్ లు వస్తే అన్ని ఓట్లు వచ్చినట్లు. అంటే ఆడియన్స్ ఒపినియన్ రౌండ్ అన్నమాట. 

ఈ టీమ్ సభ్యులు స్పేస్ టెక్నాలజీలో ఉపయోగించే అటామిక్ క్లాక్ కు బదులు క్వాంటమ్ క్లాక్ ను రూపొందిస్తున్నారు. ఈ క్వాంటమ్ క్లాక్ కొత్త తరం నావిగేషన్ వ్యవస్థలో ఎంతో ఉపయోగపడుతుందని వీరు చెబుతున్నారు. ఇది ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుందని ఈ బృందంలోని సభ్యులు తెలియజేశారు. 

 తమ వీడియోకు ఎక్కువగా లైక్ లు చేసి తమను ఆక్ట్ ఇన్ స్పేస్ 2018 అవార్డు విజేతలుగా నిలపాలని క్యూటీ స్పెస్ టీమ్ సభ్యులు ఆకాష్ కాపర్తి, జోచిమ్ మనే, వింద్యా మాదవి,  గ్జియాహూ జూ లు కోరుతున్నారు. తమ ఒక్కో లైక్ ద్వారా తెలుగు ప్రజలుగా తెలుగు విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతున్నారు.  

ఈ పోటీలో తెలుగు విద్యార్థులను గెలిపించడానికి కింది వీడియోను లైక్ చేయండి

 

 
 

loader