Asianet News TeluguAsianet News Telugu

ఈ పిల్లి ఆస్తి రూ.800కోట్లు..!

ఆ పిల్లి... డబ్బు సంపాదించుకొని బిలియనర్ అవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అమెరికా పాపులర్ సింగర్ టేలర్ స్విఫ్ట్  పెంపుడు పిల్లి.. బిలియనర్ అయ్యింది.

Taylor Swift's cat is worth a reported $97 million, but it's still not the wealthiest pet in the world
Author
First Published Jan 7, 2023, 9:30 AM IST

చాలా మంది ఇళ్లల్లో పెంపుడు జంతువులు ఉంటాయి. ఆ పెంపుడు జంతువులుగా కొందరు కుక్కలను పెంచుకుంటే... మరి కొందరు పిల్లులను పెంచుకుంటారు. ఇది చాలా సర్వ సాధారణం. ఆ పెంచుకున్న పిల్లిపై అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. వాటికంటూ స్పెషల్ దుస్తులు, బెడ్ , ఫుడ్ ఇలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు కూడా ఉన్నారు. కానీ... ఆ పిల్లి... డబ్బు సంపాదించుకొని బిలియనర్ అవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అమెరికా పాపులర్ సింగర్ టేలర్ స్విఫ్ట్  పెంపుడు పిల్లి.. బిలియనర్ అయ్యింది. ఆమె తో పాటే... ఆ పిల్లి కూడా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆ పిల్లి ఆస్తి రూ.800 కోట్లు కావడం గమనార్హం. దీంతో... ఇప్పుడు ఆ పిల్లి.. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పెంపుడు జంతువుల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ జాబితాలో ఇది మూడో స్థానంలో ఉండటం విశేషం.

Taylor Swift's cat is worth a reported $97 million, but it's still not the wealthiest pet in the world

ఈబిలియనర్ పిల్లి పేరు ఒలివియా బెన్సన్. 97 మిలియన్ల డాలర్లతో పెంపుడు జంతువుల రిచ్ లిస్ట్ లో ప్రస్తుతం ఈ పిల్లి మూడో స్థానంలో ఉంది. ఈ పిల్లి... టేలర్ తో 2014 సంవత్సరం నుంచి ఉంటోందట. ఈ ఒలివియాకు స్పెషల్ గా ఇన్ స్టాగ్రామ్ పేజీ లేదు. మరి దానికి ఆదాయం ఎలా వచ్చింది అనే సందేహం మీకు కలగొచ్చు. 

టేలర్ తన ఫోటోలు, వీడియోల్లో ఆ పిల్లిని చూపిస్తూ ఉంటుంది.  ఆమె చేసే మ్యూజిక్ వీడియోల్లో ఇది కూడా నటిస్తూ ఉంటుంది.అలా ఈ పిల్లి పాపులారిటీ సంపాదించుకుంది.  దీనికి స్పెషల్ గా ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయి. అలా ఆ పిల్లి సంపాదన పెంచుకుంది. ఒలివియా పేరిట ఓ వ్యాపార సంస్థ కూడా ఉండటం విశేషం. వీటి ద్వారా దీనికి ఆదాయం వస్తూ ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios