Tunisia Coast: ట్యునీషియా తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. 750 టన్నుల డీజిల్‌తో వెళ్తున్న ఓ నౌక ట్యునీషియా తీరంలో శనివారం మునిగిపోయింది. ఈజిప్టు నుంచి మాల్టా వెళ్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా ట్యునీషియా తీర సమీపంలోని గల్ఫ్ ఆఫ్ గేబ్స్ వద్ద ప్రమాదం సంభవించింది.
Tunisia Coast: ట్యునీషియా తీరంలో ఘోర ప్రమాదం సంభవించింది. 750 టన్నుల డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్ నౌక ట్యునీషియా తీరంలో సముద్రంలో నీట మునిగింది. శుక్రవారం సాయంత్రం ప్రతికూల వాతావరణం తలెత్తింది. ప్రతికూల వాతావరణం కారణంగా సముద్ర జలాల్లో మునిగిపోయిందని గినియాకు చెందిన జెలో ట్యాంకర్ ఈజిప్టులోని డామిట్టా పోర్ట్ నుంచి బయల్దేరింది. అయితే..ఈ నేపథ్యంలో ట్యునీషియా జలాల్లోకి ప్రవేశం కోసం ఆ ట్యాంకర్ సిబ్బంది అనుమతి కోరారు.
మరోవైపు.. ఈ ప్రమాదంతో చమురు తెట్టలు ఏర్పడే ప్రమాదముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ.. ట్యునీషియా ఆగ్నేయ తీరంలోని గల్ఫ్ ఆఫ్ గేబ్స్‌లో ఆ డీజిల్ ట్యాంకర్ శనివారం ముగినిపోయింది. అందులోని ఏడుగురు సిబ్బందిని రక్షించినట్లు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారికి అతిథ్యమిచ్చినట్లు వివరించారు.
కాగా, ప్రస్తుతానికి ఓడ నుంచి లీకేజ్ లేదని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై విపత్తు నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అయితే లీకేజ్ ప్రమాదం పొంచివున్నదని, అదే గనుక జరిగితే సముద్ర పర్యావరణ విపత్తుకు దారితీసే అవకాశం ఉందని ట్యునీషియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. డీజిల్ ట్యాంకర్ మునిగిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ట్యునీషియా విపత్తు నివారణ కమిటీ సమావేశమవుతుందని వెల్లడించింది.
ట్యునీషియా పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఇది గల్ఫ్ ఆఫ్ గేబ్స్ కు నాలుగు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. క్రమంగా ఇంజిన్ గది మునిగిపోతోంది. ఈ నౌకలో ట్యునీషియా అధికారులు ఏడుగురు సభ్యుల సిబ్బంది ఉన్నట్టు తెలిపారు. జార్జియన్ కెప్టెన్, నలుగురు టర్క్‌లు మరియు ఇద్దరు అజర్‌బైజాన్‌లు ఉన్నారని కర్రే చెప్పారు. రక్షణ, అంతర్గత, రవాణా, కస్టమ్స్ మంత్రిత్వ శాఖలు 'ఈ ప్రాంతంలో సముద్ర పర్యావరణ విపత్తును నివారించడానికి, దాని ప్రభావాన్ని పరిమితం చేయడానికి' కృషి చేస్తున్నాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఓడను రక్షించడానికి రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యులు చేపట్టాయి.
