Asianet News TeluguAsianet News Telugu

రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు: కార్మికుడి జీవితాన్ని మార్చింది ఇదే...

 ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. రత్నాల రూపంలో ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ ఘటన టాంజానియాలో చోటు చేసుకొంది. దీంతో ఆయన జీవితం మారిపోయింది.

Talk About Luck! Tanzanian Miner Finds Rare Gemstones Worth Almost Rs 25 Crore
Author
Tanzania, First Published Jun 25, 2020, 6:58 PM IST

టాంజానియా:  ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. రత్నాల రూపంలో ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ ఘటన టాంజానియాలో చోటు చేసుకొంది. దీంతో ఆయన జీవితం మారిపోయింది.

గనులు తవ్వేపని చేసుకొంటూ లైజర్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి రెండు రత్నాలు దొరికాయి. వీటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోల బరువు ఉంది. రెండవ దాని బరువు 5.103 కిలోలుంది. 

ముదురు వైలెట్-నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతని వద్ద నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిని దేశంలోని ఉత్తరాన ఉన్న టాంజానిట్ గనులలో లైజర్ కనుగొన్నారు.  

మిరేరానీలో మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్‌ రత్నాలను గుర్తించడం ఇదే తొలిసారి అని ఆ దేశానికి చెందిన గనుల మంత్రిత్వశాఖ కార్యదర్శి సైమన్ మ్సంజిలా చెప్పారు. ప్రభుత్వం అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని టాంజానియాలోని ఒక టీవీ ఛానెల్‌లో ప్రసారం చేశారు. 

టాంజానియా సెంట్రల్‌ బ్యాంక్‌ అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన చెక్కు అందించిన సమయంలో దేశ అధ్యక్షుడు జాన్‌ మాగుఫులీ స్వయంగా ఫోన్‌ చేసి లైవ్‌లో అభినందించారు. 

మైనింగ్‌ చేసే వారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం గత ఏడాది దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది
 

Follow Us:
Download App:
  • android
  • ios