పాకిస్తాన్ కి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాహిని పై కాల్పులకు తెగపడిన ఉగ్రవాది ఇషానుల్లా ఇషాన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. బాలికల విద్య కోసం కృషి చేస్తోందనే కారణంతో  2012లో మలాలాపై ఈ ఉగ్రవాది కాల్పులకు తెగపడ్డాడు.  దీంతో.. ఆమె తలలోకి బెల్లెట్లు దూసుకుపోయాయి.

అయితే... ఆమె చావుతో పోరాడి గెలిచింది. లండన్ లో పలు శస్త్ర చికిత్సల అనంతరం ఆమె తిరిగి కోలుకుంది. ఆమె ధైర్య సాహసాలకు, బాలికల విద్య కోసం ఆమె చేసిన కృషికి మెచ్చి నోబెల్ బహుమతి కూడా అందజేశారు.

Also Read కశ్మీర్ అంశంపై స్పందించిన మలాలా.. ఆర్టికల్ 370 అనే పదం లేకుండా

అయితే... తాజాగా ఆ ఉగ్రవాది పాక్ జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సదరు ఉగ్రవాదే ఓ వీడియో విడుదల చేయడం గమనార్హం. తాను పోలీసుల చెర నుంచి తప్పించుకున్నానంటూ ఆ వీడియోలో ఉగ్రవాది ఇషాన్ చెప్పాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

జనవరి 11వ తేదీన అతను పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. కాగా... 2012లో మలాలాపై దాడి చేశాడు, 2014లో పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై దాడి చేసింది కూడా ఇతనే కావడం గమనార్హం. అయితే... 2017లో పోలీసులకు చిక్కాడు. తన డిమాండ్లు నెరవేర్చలేదనే కారణంతో జైలు నుంచి పరారయ్యానని ఉగ్రవాది చెబుతుండటం విశేషం.