పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇస్తూ.. తాలిబాన్ డిప్యూటీ ప్రధాని 1971 యుద్ధానికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పై దాడులకు ఆలోచించవద్దని, లేదంటే 1971నాటి సీన్ రిపీట్ అవుతుందని పాకిస్తాన్‌కు హెచ్చరించాడు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లోని తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. ఈ వార్నింగ్‌కు తాలిబాన్లు గట్టి కౌంటర్ ఇచ్చారు. 1971 సంవత్సరం జరిగిన యుద్ధంలో ఓడిపోయి భారత్‌కు పాకిస్తాన్ లొంగినప్పటి ఓ చిత్రాన్ని తాలిబాన్లు తమ వార్నింగ్ కోసం వినియోగించుకున్నారు. తమపై దాడి చేస్తే ఊరుకోబోమని, 1971 సీన్ రిపీట్ అవుతుందని తాలిబాన్లు.. పాకిస్తాన్‌ను హెచ్చరించారు.

పాకిస్తాన్‌కు సోమవారం వారు కౌంటర్ ఇస్తూ ట్విట్టర్‌లో ఈ ఫొటోతోపాటు క్యాప్షన్ రాసి పోస్టు చేశారు. పాకిస్తాన మంత్రి.. ఎక్స్‌లెంట్ సార్.. సిరియాలోని కుర్దులను టార్గెట్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్, సిరియా, పాకిస్తాన్‌లు టర్కీ దేశం కావని పేర్కొన్నారు. ఇది అఫ్ఘనిస్తాన్ అని, ఎంతో మంది గొప్ప పాలకులను సమాధి చేసుకున్న దేశం అని తెలిపారు. తమ పై మిలిటరీ దాడికి ఆలోచించవద్దని, లేదంటే.. ఇండియాతో సిగ్గుతో చేసుకున్న మిలిటరీ ఒప్పందమే మళ్లీ రిపీట్ అవుతుందని తాలిబాన్ నేత, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అహ్మద్ యాసిర్ ట్వీట్ చేశారు. 

Also Read: బలూచిస్థాన్‌లో పేలుళ్లు.. ఐదుగురు పాకిస్థాన్ సైనికుల మృతి.. పలువురికి గాయాలు

పాకిస్తాన్‌లో పేలుళ్లు, ఇతర మార్గాల్లో తమను బెదిరిస్తే.. అలాంటి గ్రూపులు తలదాచుకునే ఆఫ్థనిస్తాన్‌లోని ఆశ్రయాలపై యాక్షన్ తీసుకోవడానికి పాకిస్తాన్‌కు చట్టబద్ధమైన అధికారం ఉన్నదని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనాఉల్లా అన్నారు.

Scroll to load tweet…

1971 యుద్ధంలో భారత్.. తూర్పు పాకిస్తాన్‌కు మద్దతుగా పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ దేశం అవతరించింది. ఓటమి తర్వాత జరిగిన అంగీకారానికి సంబంధించిన ఫొటోనే ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ పీఎం ట్వీట్ చేసి పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు.