Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌ వాసులకు క్షమాభిక్ష: విధుల్లో చేరాలని అధికారులకు తాలిబన్ల ఆదేశం

ఆఫ్ఘనిస్తాన్‌ వాసులకు తాలిబన్లు క్షమాభిక్ష ప్రకటించారు. రెండు రోజుల్లో విధుల్లో  చేరాలని  అధికారులకు వారు ఆదేశించారు. ఈ మేరకు తాలిబన్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రజలంతా  పూర్తి విశ్వాసంతో సాధారణ జీవితం గడపవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Taliban Declares General Amnesty, Tells Officials "Start Routine Life"
Author
Afghanistan, First Published Aug 17, 2021, 1:07 PM IST

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలకు తాలిబన్లు క్షమాబిక్షను ప్రకటించింది. రెండు రోజుల్లోనే తిరిగి విధులకు హాజరు కావాలని అధికారులను  ఆదేశించింది.

అందరికీ సాధారణ క్షమాభిక్ష ప్రకటించినట్టుగా తాలిబన్లు ఓ ప్రకటనను విడుదల చేశారు. పూర్తి విశ్వాసంతో మీ జీవితాన్ని ప్రారంభించాలని ఆ ప్రకటనల్ తేల్చి చెప్పారు.ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ సైన్యాన్ని ఉపసంహరించుకొంటామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజులకే తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ లో అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారు.

తాలిబన్లు కాబూల్ ను వశం చేసుకొన్న తర్వాత ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో తాలిబన్లు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించవద్దని తమ ఫైటర్లను ఆదేశించినట్టుగా తాలిబన్లు స్పష్టం చేశారు.ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపాడాలని కూడ సూచించామన్నారు.

కాబూల్‌ను స్వాధీనం చేసుకొన్న తర్వాత ఆప్ఘనిస్తాన్‌లోని ఓ వినోద కార్యక్రమంలో తాలిబన్లు ఎంజాయ్ చేశారు. చేతుల్లో ఆయుధాలతో ఎలక్టిక్ బంపర్ కార్లను నడుపుతూ ఆనందంగా గడిపారు.  బొమ్మ గుర్రాలపై స్వారీ చేస్తూ గడిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి.

also read:తాలిబన్లు ఉగ్రవాదులే.. నిషేధం విధించిన ఫేస్ బుక్..అదే బాటలో ట్విటర్..

ఆఫ్ఘన్‌లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాబూల్‌లో భారత రాయబారి, అతని సిబ్బంది వెంటనే ఇండియాకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా చెప్పారు.

తాలిబన్ నాయకుడు అమీర్ ఖాన్ ముత్తాకి ఆఫ్ఘన్ రాజధానిలో కాబూల్ రాజకీయనాయకత్వంతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఒకప్పుడు దేశానికి నాయకత్వానికి వహించిన అబ్దుల్లా, హామీద్ కర్జాయ్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు.ముత్తాఖి గతంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios