Asianet News TeluguAsianet News Telugu

తాలిబన్ల అరాచకం.. మహిళా నటులు కనిపించే షోలు ప్రసారం చేయద్దు.. మీడియాకు హుకూం జారీ...

ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ నుంచి  అక్కడి మీడియాకు వచ్చిన తొలి అధికారిక ఉత్తర్వులు ఇవి.మహిళా నటులు ఉండే కార్యక్రమాలతోపాటు  మహమ్మద్ ప్రవక్త,  ఇతర మత ప్రముఖులను చూపించే సినిమాలు, ప్రోగ్రాంలను ఛానళ్లు ప్రసారం చేయరాదని ఆ దేశ  ప్రమోషన్ ఫర్  వర్చ్యూ అండ్ ప్రివెన్షన్  ఆఫ్  వైస్  మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Taliban bans TV shows featuring women actors as a part of 'religious guideline'
Author
Hyderabad, First Published Nov 22, 2021, 2:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాబూల్ :  తాలిబన్ల కబంధహస్తాల్లో Afghanistan వాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అడుగడుగునా ఆంక్షలతో సతమతమవుతున్నారు. ఇప్పటికే అక్కడ 
Womenపై కఠిన ఆంక్షలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలపై నిబంధనలు కొనసాగుతున్నాయి. తాజాగా టీవీ షోలపైనా ఆంక్షలు  విధించింది  Taliban government.  మహిళా నటులు ఉండే షోలు, డ్రామాల ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ నుంచి  అక్కడి మీడియాకు వచ్చిన తొలి అధికారిక ఉత్తర్వులు ఇవి. Female Actors ఉండే కార్యక్రమాలతోపాటు  మహమ్మద్ ప్రవక్త,  ఇతర మత ప్రముఖులను చూపించే సినిమాలు, ప్రోగ్రాంలను ఛానళ్లు ప్రసారం చేయరాదని ఆ దేశ  ప్రమోషన్ ఫర్  వర్చ్యూ అండ్ ప్రివెన్షన్  ఆఫ్  వైస్  మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, 
Women journalists రిపోర్టింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని స్పష్టం చేసింది.  ఇప్పటికే తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల dressingపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

2001లో ఆఫ్గాన్ లో ప్రజాస్వామ్య పాలన తర్వాత ఆ దేశ మీడియాలో చాలా మార్పులు  వచ్చాయి. పాశ్చాత్య దేశాల మద్దతుతో నడిచిన పాలనలో ఎన్నో టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు పుట్టుకొచ్చాయి. గత 20 ఏళ్లలో ఈ ఛానల్ లు అన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా అనేక కార్యక్రమాలను స్వేచ్ఛగా ప్రసారం చేశాయి. అమెరికన్ ఐడల్ లాంటి రియాల్టీ షో లతోపాటు  పలు విదేశీ షోలు,  భారతీయ సినిమా,  సీరియళ్లను ప్రసారం చేశాయి.  

ఇప్పుడు మళ్లీ తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి రాగానే... వాటిపై కొరడా ఝుళిపిస్తోంది.  ఇప్పటికే IPL  ప్రసారాలపై  నిషేధం విధించిన  తాలిబన్ సర్కార్..  ఇప్పుడు మహిళలు నటించే ప్రోగ్రాం తీసుకువచ్చింది. దీంతో రెండు దశాబ్దాల కింద ఉన్న తాలిబన్ల  అరాచక పాలన మళ్లీ మొదలైందని ప్రజలు వాపోతున్నారు.  గతంలో తాలిబన్లు పాలించినప్పుడు  TV, movie, మా ఇతర entertainment programsను అనైతికంగా పేర్కొంటూ వాటిపై నిషేధం విధించారు. టీవీలు చూస్తూ  కనిపించిన వారికి  బహిరంగంగానే శిక్షలు వేశారు. 

ఇదిలా ఉండగా, అక్టోబర్ లో తాలిబన్లు దారుణానికి ఒడి గట్టారు. తాలిబన్ల రాజ్యం ఏర్పడిన తర్వాత ఛీర్ గర్ల్స్‌ను టీవీల్లో చూపిస్తున్నారనే ఉద్దేశంలో దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన తాలిబన్లు, మహిళలు బహిరంగంగా క్రీడలు ఆడడంపై కూడా బ్యాన్ వేశారు. శరీర అవయవాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకోవాల్సి ఉంటుందని ఆఫ్ఘాన్ మహిళా క్రికెట్ జట్టును కూడా నిషేధించిన తాలిబన్లు, తాజాగా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వాలీబాల్ ఆడుతుందనే కారణంగా ఓ యువ క్రీడాకారిణిని దారుణంగా హత్య చేశారు.

ఆఫ్ఘనిస్తాన్: అప్పటిదాకా నో పనిష్మెంట్.. బహిరంగ శిక్షలపై తాలిబన్ల సంచలన ప్రకటన

పాశవిక పరిపాలనకు అద్దం పట్టేలా  జరిగిన ఈ సంఘటన కాబూల్ సమీపంలోనే జరిగింది. ఆఫ్ఘాన్ అండర్-19 జాతీయ వాలీబాల్ జట్టుకి చెందిన ఓ 18 ఏళ్ల మహ్జాబిన్ హకీమా అనే క్రీడాకారిణి... తాలిబన్ల హెచ్చరికలు పట్టించుకోకుండా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. దీంతో ఆమెను బంధించిన తాలిబన్లు, చిత్రహింసలు చేసి తల నరికి వీధుల్లో ఊరేగించారట.

తమ హెచ్చరికలను పట్టించుకోకుండా మహిళలు, అమ్మాయిలు ఎవరైనా ఆటలు ఆడాలని ప్రయత్నిస్తే, వారికి ఇదే గతి పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ అండర్19 వాలీబాల్ కోచ్ సురాయా ఆఫ్జాలీ చెప్పే వరకూ ప్రపంచానికి తెలియకపోవడం విశేషం. తాలిబన్లకు బయటికి అప్పటికే ఇద్దరు మహిళా వాలీబాల్ ప్లేయర్లు దేశం విడిచి పారిపోగా, ఆర్థిక స్థోమత సరిగా లేని క్రీడాకారులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారట.
 

Follow Us:
Download App:
  • android
  • ios