Asianet News TeluguAsianet News Telugu

నార్వే ఎంబసీలో తాలిబన్లు.. వైన్ సీసాలు పగలగట్టి, పుస్తకాలు ధ్వంసం చేసి బీభత్సం...

కాబూల్ లోని తమ ఎంబసీని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని, ఆ తరువాత తిరిగి దానికి తమకు అందిస్తామన్నారని ఇరాన్ లో నార్వే రాయబారి సిగ్వల్డ్ హాగ్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంబసీలోని వైన్ సీసాలను, పిల్లల పుస్తకాలను వారు ధ్వంసం చేశారని తెలిపారు. 

Taliban Asks Envoys At Norway Embassy To Smash Wine Bottles, Destroy Books
Author
Hyderabad, First Published Sep 9, 2021, 4:19 PM IST

ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా కాబూల్ లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు లోపలున్న వైన్ సీసాలను పగలగొట్టి, పుస్తకాలను ధ్వంసం చేశారు. 

కాబూల్ లోని తమ ఎంబసీని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని, ఆ తరువాత తిరిగి దానికి తమకు అందిస్తామన్నారని ఇరాన్ లో నార్వే రాయబారి సిగ్వల్డ్ హాగ్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంబసీలోని వైన్ సీసాలను, పిల్లల పుస్తకాలను వారు ధ్వంసం చేశారని తెలిపారు. 

ఇటీవల తాలిబన్లు మాట్లాడుతూ తాము విదేశీ దౌత్య కార్యాలయాలు సహా సంస్థల జోలికి పోబోమని తెలిపారు. అయితే, అంతలోనే నార్వే రాయబార కార్యాలయం మీద పడడం వారి మాటలకు, చేతలకు మధ్య పొంతన ఉండడం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. 

కాగా, మొన్న తాలిబన్లు ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో అంతర్జాతీయ ఉగ్రవాది సిరాజుద్దీన్ హక్కానీ అంతర్గత శాఖ మంత్రిగా ఉన్నారు. త్వరలోనే హిబతుల్లా అఖుంద్ జాదా సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. 

కాగా, తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగింది. ప్రెస్ ఫ్రీడమ్‌కు ఆటంకం కలిగించబోమని గతంలో చేసిన వాగ్దానాలు నీటిమూటలని ఈ చర్యతో ప్రపంచానికి తాలిబాన్ చాటిచెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ఆందోళనలను కవర్ చేయవద్దంటూ తాలిబాన్లు హుకూం జారీ చేశారు. ఆందోళనలను రిపోర్ట్ చేసిన జర్నలిస్టులపై క్రూరంగా దాడి చేసింది. ఓ గదిలో బంధించి హింసించింది. అలా తాలిబాన్ల చేతిలో దాడికి గురై దేహమంతా హూనమైన జర్నలిస్టుల గాయాల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు జర్నలిస్టులు తమ వెన్ను భాగాన్ని కెమెరాకు చూపిస్తున్న ఫొటోలూ తాలిబాన్ల దుర్మార్గాన్ని కళ్లకు కట్టినట్టూ వెల్లడించాయి.

ట్విట్టర వెరిఫై చేసిన ఖాతాల్లో ఈ ఫొటోలు కనిపించాయి. లాస్ ఏంజెల్స్ టైమ్స్ విదేశీ ప్రతినిధి మార్కస్ యమ్, అఫ్ఘాన్ న్యూస్ పబ్లికేషన్ హ్యాండిల్ ఇతిలాత్రోజ్‌.. తాలిబాన్ల చేతిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టుల ఫొటోలు షేర్ చేశాయి. జర్నలిస్టుల దేహమంతా దాడులతో కమిలిపోయాయి. జర్నలిస్టులను విచక్షణా రహితంగా బాదినట్టు వాటి ద్వారా తెలుస్తున్నది. 

ఆఫ్ఘనిస్తాన్: 200 మంది అమెరికన్లు, ఇతర విదేశీయుల తరలింపుకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్

‘మేం జర్నలిస్టులమని చెప్పినా వారు ఖాతరు చేయలేదు. బహుశా వారు మమ్మల్ని చంపేస్తారేమోనని భయపడ్డా’ అంటూ ఇతిలాత్రోజ్ ఎంప్లాయీ నెమతుల్లా నఖ్దీ వివరించారు. ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులన వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లి తీవ్రంగా బాదుతున్నారు. స్వదేశీ జర్నలిస్టులను మహిళల ఆందోళనలకు సంబంధించి ఫొటోలు తీయకుండా తాలిబాన్లు అడ్డుకున్నారు. విదేశీ జర్నలిస్టులను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. కొందరు విదేశీ జర్నలిస్టులనూ అపహరించి కొంతకాలం నిర్బంధించి తర్వాత విడుదల చేసినట్టు లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios