చైనా, తైవాన్లు యుద్దానికి సిద్దమవుతున్నట్టు సింగపూర్ పోస్ట్ నివేదిక ఇచ్చింది. తైవాన్ ఉనికి ఎవరినీ రెచ్చగొట్టేది కాదని, ఈ ద్వీపం తైవాన్ ప్రజలకు చెందినదని చైనా పేరు చెప్పకుండానే తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్ బీజింగ్‌ను హెచ్చరించారు.
తైవాన్‌ను ప్రధాన భూభాగంలో తిరిగి విలీనం చేసుకునే లక్ష్యంతో చైనా తన సైన్యాన్ని కదుపుతోంది. ఈ క్రమంలో తైవాన్ కూడా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ మేరుకు తైవాన్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని అని సింగపూర్ పోస్ట్ నివేదించింది.
చైనా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న తైవాన్ సైనిక సన్నాహాలు ప్రారంభించింది. అంతకుముందు..ఆదివారం తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్
తన ద్వీపం తమ ప్రజలకు చెందినదని, తైవాన్ ఉనికికి ప్రమాదం కలిగిస్తే చర్యలను సహించమని(బీజింగ్‌ను)హెచ్చరించారు. ఈ ప్రకటన అనంతరం చైనా,తైవాన్‌లు రక్షణ సన్నాహాలు,యుద్ధం వైపు కదులుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదిక వెల్లడిస్తున్నాయి. తైవాన్‌ను తిరిగి తమ దేశంలో కలపాలనే ఉద్దేశ్యంతో చైనా తన సైనిక కార్యకలాపాలను చేస్తుందని పేర్కొంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, తైపీ కూడా తన రక్షణ కోసం, యుద్ధంలో పరిస్థితిని ఎదుర్కోవటానికి సన్నాహాలు ప్రారంభించిన సింగపూర్ పోస్ట్ నివేదిక వెల్లడిస్తుంది.
చైనా ఉద్దేశాన్ని పసిగట్టిన తైపీ తన సైనిక సన్నాహాలను ప్రారంభించిందని పేర్కొంది. తైవాన్ స్థానిక మీడియా పోస్ట్ ఆధారంగా సింగపూర్ పోస్ట్ ఈ వార్తను వెల్లడించింది.సైనిక ప్లాట్‌ఫారమ్‌లు,ఫైటర్ జెట్‌లు,నావల్ షిప్‌ల వంటి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి బదులుగా తైవాన్ ప్రాణాంతకమైన యాంటీ-షిప్ ఆయుధాలు,ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులపై దృష్టి సారించిందని పేర్కొంది.
యుద్ధానికి సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన సైన్యాన్ని ఆదేశించినట్లుగానే, తైవాన్ అధినేత్రి కూడా జిన్‌పింగ్ విధానాలకు లొంగిపోనని స్పష్టంగా ప్రకటించారు. చైనా సార్వభౌమాధికారం కింద స్వయం ప్రరతిపత్తి కోసం జిన్‌పింగ్ చేసిన 'ఒక దేశం, రెండు వ్యవస్థలు' ప్రతిపాదనను ఆమోదించబోమని, తైవాన్ ప్రెసిడెంట్ ద్వీపం తన ప్రజల కోసం మిగిలిపోవడమే తన జీవిత లక్ష్యం అని అన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నవంబర్ 8న బీజింగ్‌కు సైనిక శిక్షణను పటిష్టం చేయాలని, ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం కావాలని ఆదేశించినట్లు చెప్పారు. చైనా భద్రత విషయంలో అస్థిరత,అనిశ్చితి పెరుగుతోందని ఆయన అన్నారు. బీజింగ్‌లోని చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ కామన్ కమాండ్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా చైనా అధ్యక్షుడు ఈ విషయం చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, కరెన్సీతో ప్రత్యేక దేశంగా ఉన్న తైవాన్‌ను చైనా తన భాగంగా పరిగణిస్తుంది. సైనిక చర్య ద్వారా తైవాన్ ను లొంగదీసుకుంటామని చైనా హెచ్చరించింది.
మరోవైపు.. ప్రజాస్వామ్య ద్వీపంపై దాడి ఎప్పుడైనా జరగవచ్చని యుఎస్ డిఫెన్స్ అండర్ సెక్రటరీ ఆఫ్ పాలసీ కోలిన్ ఖాల్ అన్నారు. “రాబోయే రెండేళ్లలో తైవాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నమని ప్రకటించారు. నవంబర్ 4న ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ దశాబ్దం చివరి నాటికి లేదా బహుశా 2027 నాటికి ఆ సామర్థ్యాన్ని కలిగి పొందవచ్చని అన్నారు.
