Asianet News TeluguAsianet News Telugu

ఒకే మహిళతో నాలుగుసార్లు పెళ్లి.. మూడుసార్లు విడాకులు ఇచ్చి..

పెళ్లికి  సెలవలు తీసుకునే అవకాశం ఉండటంతో.. దానిని ఓ బ్యాంక్ ఉద్యోగి ఇలా వినియోగించుకున్నాడు. 

Taiwan man marries four times, divorces three times to get extra paid leaves
Author
Hyderabad, First Published Apr 16, 2021, 8:37 AM IST

ఓ వ్యక్తి తన భార్యను నాలుగుసార్లు పెళ్లి చేసుకున్నాడు. అలా నాలుగుసార్లు పెళ్లి చేసుకునేందుకు మూడుసార్లు విడాకులు కూడా ఇచ్చాడు. అదే మహిళను అన్నిసార్లు పెళ్లి చేసుకోవడానికి.. మళ్లీ విడాకులు ఈ తతంగమంతా ఎందుకు అనే అనుమానం  మీకూ కలిగిందా..? అతను సెలవుల కోసం వేసిన ప్లానే.. ఈ భార్యతో మళ్లీ పెళ్లి కాన్సెప్ట్.

అవును.. పెళ్లికి  సెలవలు తీసుకునే అవకాశం ఉండటంతో.. దానిని ఓ బ్యాంక్ ఉద్యోగి ఇలా వినియోగించుకున్నాడు. ఈ సంఘటన తైవాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తైవాన్‌ రాజధాని తాయ్‌పెయ్‌ నగరంలో ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన సంస్థ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు. తైవాన్‌ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల సెలవు తప్పనిసరి. 

దీన్నే అడ్డంగా పెట్టుకుని ఈ పెళ్లి స్టంట్ చేశాడు. సంస్థ మంజూరు చేసిన సెలవుతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇచ్చి మళ్లీ పెళ్లి కోసం సెలవు దరఖాస్తు చేశాడు. అలా అతను తన భార్యకు 3 సార్లు విడాకులు ఇచ్చి మళ్లీ ఆమెనే 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. 

అందుకుగాను మొత్తం 32 రోజుల కోసం లీవ్‌ అప్లై చేశాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనికి లీవ్‌ను పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టుకెక్కాడు. దీంతో.. ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios