దుబాయ్‌లో దావూదీ బోహ్రా కమ్యూనిటీ నాయకుడు, సుల్తాన్ అల్-బోహ్రా సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ ఖర్జూర చెట్ల పెంపకాన్ని విస్తరించే ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్నారు. దుబాయ్ లో వాతావరణానికి అనుగుణంగా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి చర్యలు చేపడుతున్నారు. అల్ ఖుసైస్‌లో 80 దేశీయ ఖర్జూర చెట్లను నాటడం ప్రారంభించారు.
దుబాయ్ లో వాతావరణానికి అనుగుణంగా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి చర్యలు చేపడుతున్నారు. హరిత దుబాయ్ గా మార్చడానికి దావూదీ బోహ్రా కమ్యూనిటీ నాయకుడు, సుల్తాన్ అల్-బోహ్రా సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ నేత్రుత్వం లో అల్ ఖుసైస్‌లో 80 దేశీయ ఖర్జూర చెట్లను నాటడం ప్రారంభించారు. ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు, దుబాయ్ మునిసిపాలిటీకి చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో అల్ ఖుసైస్‌లోని బుర్హానీ మసీదు సమీపంలోని రిజర్వాయర్ వద్ద సయ్యద్నా సైఫుద్దీన్ ఖర్జూర చెట్టును నాటారు.
ప్రాజెక్ట్ రైజ్‌లో భాగంగా స్థానిక సంఘాలు, సంస్థలతో కలిసి మెరుగైన పోషకాహారం, ఆరోగ్యం, నీరు, పర్యావరణ పరిరక్షణను అందించాలని ప్రయత్నం జరుగుతుంది. ఎమిరేట్ ను హరితమయం చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రకృతి నిల్వలను నెలకొల్పడానికి UAE వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు HH షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రారంభించిన దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్‌కు మద్దతు ఇస్తుంది. COP28 లక్ష్యాలతో పాటు స్థిరమైన అభ్యాసాల పట్ల దేశవ్యాప్త నిబద్ధత ద్వారా సామూహిక చర్యను ప్రేరేపించడం, పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
ప్రాజెక్ట్ గురించి UAEలోని సుల్తాన్ అల్ బోహ్రా ప్రతినిధి కినానా జమాలుద్దీన్ మాట్లాడుతూ.. “ఖర్జూరం చెట్ల పెంపకం చొరవ సహకారం, సమిష్టి బాధ్యత యొక్క స్ఫూర్తిని కలిగి ఉంటుంది. ఇది స్థిరమైన అభివృద్ధికి UAE విధానాన్ని నిర్వచిస్తుంది. ఖర్జూర చెట్ల పెంపకాన్ని విస్తరించడానికి సయ్యద్నా సైఫుద్దీన్ మద్దతు, పర్యావరణంపై శాశ్వత ప్రభావాన్ని చూపాలని, ఈ ప్రాంతంలో వాతావరణ మార్పులను తగ్గించడంలో సంఘం యొక్క నిబద్ధతను బలోపేతం చేయాలని మేము ఆశిస్తున్నాము. అని పేర్కొన్నారు.
ఖర్జూరం ప్రపంచంలోని ఖర్జూర ఉత్పత్తిదారులలో UAE ఒకటి . కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఖర్జూరం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖర్జూర ఉత్పత్తి చాలా మంది రైతులకు జీవనోపాధిని అందిస్తుంది. ఎమిరేట్స్ ఎగుమతి ఆదాయానికి దోహదం చేస్తుంది. ఖర్జూర తోటల ఉనికి స్థానిక జీవవైవిధ్యానికి దోహదపడుతుంది. వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలానికి మద్దతు ఇస్తుందని జమాలుద్దీన్ పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ ఎమిరేట్స్‌లో ఇటీవల ముగిసిన ఆశారా ముబారకా సమ్మేళనం సందర్భంగా దాదాపు 75,000 మంది కమ్యూనిటీ సభ్యులకు ఆతిథ్యం ఇవ్వడంలో దావూదీ బోహ్రా కమ్యూనిటీకి నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు UAE ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తుందని తెలిపారు. చెట్ల పెంపకం డ్రైవ్‌లు, సాధారణ క్లీనప్ కార్యకలాపాల నుండి జీరో వేస్ట్, పునరుత్పాదక శక్తికి మారడం వరకు UAEలోని దావూదీ బోహ్రా కమ్యూనిటీ వివిధ రకాల పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తోంది.UAE సహజ వనరులను పరిరక్షించడానికి సమిష్టిగా చర్యలు చేపడుతోంది. గత ఏడాది అబుదాబి పర్యటన సందర్భంగా సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ ఎమిరేట్ మొత్తం మడ అడవులను పెంచడానికి 10,000 మడ మొక్కలను అందించి, మాంగ్రోవ్ పెంపకానికి మద్దతు ఇచ్చారు.
