IMF: ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే, ఈ ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల భార‌త్ ను దెబ్బ‌తిస్తుంద‌నీ, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివా అన్నారు.  

IMF: గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా క‌రోనా మ‌మ్మారి కార‌ణంగా అంత‌ర్జాతీయ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎద‌ర్కొంటున్న‌ది. కోవిడ్ దెబ్బ‌తో చాలా దేశాలు సంక్షోభంలోకి సైతం జారుకున్నాయి. అయితే, ఇటీవ‌ల క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డంతో ఇప్పుడిప్పుడే చాలా దేశాల ఆర్థిక ప‌రిస్థితులు గాడిలో ప‌డుతున్నాయి. క్షీణ‌త నుంచి వృద్ధి దిశ‌గా ముందుకు సాగుతున్నాయి. అయితే, ప్ర‌స్తుతం కోన‌సాగుతున్న ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం అంత‌ర్జాతీయంగా తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ది. మ‌ళ్లీ ఆర్థిక సంక్షోభానికి కార‌ణ‌మ‌వుతూ.. ఆయా దేశాల‌ను ప్ర‌భావితం చేస్తున్న‌ది. ఈ యుద్ధం కార‌ణంగా ప్ర‌స్తుతం చ‌మురు ధ‌ర‌లు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి. 

ప్ర‌స్తుత ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల అనేక దేశాల‌పై ప్ర‌భావం చూపుతున్న‌ది. దీనిపై స్పందించిన ఐఎంఎఫ్ (International Monetary Fund).. ప్ర‌స్తుత ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల భార‌త్ ను దెబ్బ‌తీస్తుంద‌ని తెలిపింది. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఇంధ‌న ధ‌ర‌ల ప్రభావం అధికంగా ఉంటుంద‌ని తెలిపింది. ఐఎంఎఫ్ (IMF-International Monetary Fund) ఎండీ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు భార‌త్ ను దెబ్బ‌తీస్తాయ‌ని అన్నారు. భారతదేశం తన ఆర్థిక నిర్వహణలో చాలా మెరుగైన స్థానాలో ఉంద‌ని పేర్కొన్న ఆమె.. ప్ర‌స్తుత‌ గ్లోబల్ ఇంధన ధరల పెరుగుదల దాని ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెల్ల‌డించింది. 

"భారతదేశం తన ఆర్థిక నిర్వహణలో చాలా బాగా ఉంది. అయితే ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల దాని ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది" అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ‌ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ప్రపంచ దేశాల‌పై దాని ప్రభావంపై తాజాగా జ‌రిగిన మీడియా రౌండ్‌టేబుల్ సందర్భంగా ఆమె ఇవ్యాఖ్య‌లు చేశారు. అలాగే, IMF మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న గీతా గోపీనాథ్ సైతం.. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలకు ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం సవాలుగా మారిందని పేర్కొన్నారు. "భారతదేశం ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు ప‌రుగుతున్నాయి. ఇది భారతీయ గృహాల కొనుగోలు శక్తిపై ప్రభావం చూపుతుంద‌న్నారు. 

"మీరు హెడ్‌లైన్ ద్రవ్యోల్బణ సంఖ్యలను పరిశీలిస్తే, భారతదేశంలో ద్రవ్యోల్బణం దాదాపు ఆరు శాతానికి దగ్గరగా ఉంది, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ద్రవ్యోల్బణం బ్యాండ్‌లో గ‌రిష్ఠ‌ ముగింపు" అని గోపీనాథ్ చెప్పారు. ఇది దేశంలోని ద్రవ్య విధానంపై ప్రభావం చూపుతుందని, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇది సవాలుగా ఉందని ఆమె అన్నారు.

ఐఎంఎఫ్ (IMF-International Monetary Fund) ఎండీ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. "భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ముఖ్యమైన అంశం ఇంధన ధరలు అని పేర్కొన్నారు. భారతదేశం ఒక ప్ర‌ధాన ఇంధ‌న‌ దిగుమతిదారుగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఇంధన ధరల పెరుగుదల దానిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.. అయితే, ఇప్ప‌టికే భారతదేశం తన ఆర్థిక నిర్వహణలో చాలా మెరుగ్గా ఉంది" అని ఆమె అన్నారు. సవాలుకు ప్రతిస్పందించడానికి కొన్ని ఆర్థిక స్థలాలు ఉన్నాయని ఆమె నొక్కి చెప్పారు. "మా సభ్యులకు మా సలహా ఏమిటంటే, అత్యంత హాని కలిగించే జనాభాను ధరల పెరుగుదల నుండి, శక్తి మాత్రమే కాకుండా, ఇది ముఖ్యమైన కారకంగా మారే దేశాలకు ఫుట్ ఫుడ్ ధరలు (foot food prices) కూడా మీరు రక్షించేలా చూసుకోవాలి" అని IMF ఎండీ జార్జివా పేర్కొన్నారు.