పాక్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. ఏడుగురు మృతి

పాకిస్థాన్ లో ఘోరం జరిగింది. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు అలీ జర్దారీ ఖండించారు.

Suicide attack on Pakistan army base Seven dead..ISR

వాయవ్య పాకిస్థాన్ లోని సువిశాల సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కును సైనిక స్థావరంపైకి తీసుకెళ్లి ఢీకొట్టినట్లు సైనిక, భద్రతా అధికారులు తెలిపారు. బాంబు దాడి, ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు మరణించారు. 

ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజీరిస్థాన్ లో జరిగిన ఈ దాడిలో మరో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం తెలిపింది. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సైనిక స్థావరంలో కొంత భాగం కూలిపోయినట్లు మిలటరీ తెలిపింది. ట్రక్కు బాంబు దాడిలో ఐదుగురు సైనికులు, ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు అధికారులు మరణించారు.

ఈ ప్రాంతంలో క్లియరెన్స్ ఆపరేషన్ కొనసాగుతోందని, దేశం నుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు పాక్ భద్రతా దళాలు కృతనిశ్చయంతో ఉన్నాయని, మన వీర సైనికుల త్యాగాలు తమ సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని సైన్యం పేర్కొంది. ఈ ఘటనలో అమరులైన సైనికులకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాళి అర్పించారు. ఈ దాడిని ఖండించారు. 

కాగా.. ఉత్తర వజీరిస్తాన్ పాకిస్తాన్.. తాలిబన్లు, ఇతర ఉగ్రవాద గ్రూపులకు స్థావరంగా చాలా కాలం పనిచేసింది, అయితే కొన్ని సంవత్సరాల క్రితం సైన్యం ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులను సైన్యం వెళ్లగొట్టింది. అయితే అడపాదడపా దాడులు జరుగుతుండటంతో ఈ ప్రాంతంలో పాక్ తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios