Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు స్టంట్.. లాస్ ఏంజిల్స్ లో బ్రిడ్జి ఎక్కుతూ బాలుడు మృతి..

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఓ బాలుడు లాస్ ఏంజిల్స్ లోని బ్రిడ్జి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జారి కిందపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం చికిత్స పొందుతూ మరణించాడు.

Stunt to become famous on social media.. Boy died while climbing a bridge in Los Angeles..ISR
Author
First Published May 25, 2023, 10:29 AM IST

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేసిన పని ఓ బాలుడి మరణానికి కారణమయ్యింది. లాస్ ఏంజిల్స్ (ఎల్ఏ)లోని ఓ బ్రిడ్జిపై స్టంట్ చేస్తుండగా కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

2024 జనవరిలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం.. ప్రజలను ఆహ్వానించిన యోగి ఆదిత్యనాథ్

లాస్ ఏంజిల్స్ పోలీస్ చీఫ్ మైఖేల్ మూర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియా ఫేమస్ అయ్యేందుకు ఓ 17 ఏళ్ల బాలుడు బ్రిడ్జి ఎక్కాలని ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో అతడి కాలు జారడంతో కిందపడ్డాడు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని స్థానికులు రక్షించి హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో మరణించాడు.

అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి.. ఏమైందంటే ?

కాగా.. స్ట్రీట్ రేసింగ్, గ్రాఫిటీ, అక్రమ టేకోవర్లకు హాట్ స్పాట్ గా మారిన ఈ బ్రిడ్జిని గతంలో స్థానిక పోలీసులు పలుమార్లు మూసివేశారు. డ్రైవర్లు తమ వాహనాల్లో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడానికి ఈ బ్రిడ్జిని ఉపయోగిస్తున్నారు. వేలాది ఎల్ఈడీ లైట్లు, ఎల్ఏ స్కైలైన్ దృశ్యాలతో కూడిన ఈ వంతెనను గత జూలైలో ప్రారంభించి 84 ఏళ్ల ఆర్ట్ డెకో స్పాన్ స్థానంలో ప్రారంభించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios