Asianet News TeluguAsianet News Telugu

పెరూలో తీవ్ర భూకంపం.. 7.2గా నమోదు..

దక్షిణ పెరూలోని తిరపటా ప్రాంతంలో గురువారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది.

Strong earthquake of magnitude 7.2 strikes Peru, no reports of damage or casualties
Author
Hyderabad, First Published May 27, 2022, 7:37 AM IST

పెరూ : earthquake 212 కిమీ (132 మైళ్లు) లోతులో ఉందని యుఎస్‌జిఎస్ తెలిపింది. అయితే దీనివల్ల... ఎలాంటి Tsunami హెచ్చరికలు లేవని యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది. అలాగే ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం గురించి ముందస్తు నివేదికలు కూడా ఏమీ లేవు.

అంతకుముందు, యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) భూకంపం తీవ్రత 7గా ఉందని అంచనా వేసింది. "మాకు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. ఈ భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు" అని పెరూ జియోఫిజికల్ ఇన్స్టిట్యూట్ (IGP) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ హెర్నాండో తవేరా స్థానిక రేడియో స్టేషన్ కి తెలిపారు. "ఉపరితలంపై ఉన్న తీవ్రత స్థాయిని బట్టి, ఎటువంటి నష్టం జరగకూడదు." అన్నారు. 

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, అరేక్విపా, కుస్కో, టక్నా దక్షిణ ప్రాంతాలలో కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ నివాసితులు భద్రత కోసం వీధుల్లోకి వచ్చారు.పెరూలోని కొన్ని ముఖ్యమైన గనులు, ప్రపంచంలో రెండవ అతిపెద్ద రాగి ఉత్పత్తి కేంద్రం అయిన గనులు, దేశానికి దక్షిణాన ఉన్నాయి.

మిన్సూర్ శాన్ రాఫెల్ జింక్ గని పునో ప్రాంతంలో పనిచేస్తుంది. అయితే, ఈ భూకంపంపై వ్యాఖ్యానించడానికి సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేరు. పెరూ.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలవబడే ప్రాంతంలో ఉంది. ఇక్కడే ప్రపంచంలోని భూకంప కార్యకలాపాలలో దాదాపు 85% సంభవిస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios