సారాంశం

 శ్రీలంకలో  మంగళవారంనాడు  భూకంప్రకనలు చోటు చేసుకున్నాయి.  దీంతో ప్రజలు భయాందోళనలు చెందారు.  భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది.

కొలంబో: శ్రీలంక రాజధాని  కొలంబోలో  మంగళవారంనాడు భూకంపం సంభవించింది.  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ  సమాచారం మేరకు భూకంప తీవ్రత 6.2 గా నమోదైంది. భూకంపం కారణంగా  ఎలాంటి  ప్రాణ నష్టం జరిగినట్టుగా రిపోర్టు అందలేదు.  భూకంపం కారణంగా  భయంతో జనం పరుగులు తీశారు. 

 

శ్రీలంకకు ఆగ్నేయంగా 800 కి.మీ. దూరంలోని హిందూ మహా సముద్రంలో  10 కి.మీ. లోతులో భూకంపం సంభవించిందని భూగర్బ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా  శ్రీలంకకు ఎలాంటి ప్రమాదం లేదని  జియోలాజికల్ సర్వే మైన్స్ బ్యూరో ప్రకటించింది.సోమవారంనాడు దక్షిణ సూడాన్, ఉగాండా  సరిహద్దు చుట్టూ ఉన్న ప్రాంతంలో  భూకంపం వాటిల్లింది. యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్  ఈ మేరకు  తెలిపింది.  సోమవారంనాడు సాయంత్రం తజికిస్తాన్ లో  4.9 తీవ్రతతో భూకంపం వాటిల్లింది.  నిన్న సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు భూకంపం వాటిల్లింది.  

భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా  పలు దేశాల్లో ఇటీవల కాలంలో  తరచుగా  భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి.  ఇటీవల కాలంలో నేపాల్ లో జరిగిన భూకంపం  కారణంగా వందకు పైగా మృతి చెందారు.

ఈ నెల  11న న్యూఢిల్లీలో  భూకంపం సంబవించింది.  నేపాల్ లో  భూకంపం కారణంగా  ఢిల్లీలో  భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని  భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. 

also read:న్యూఢిల్లీలో భూప్రంకపనలు:భయంతో జనం పరుగులు

ఈ నెల  9వ తేదీన ఇండోనేషియాలో  భూకంపం వాటిల్లింది.  బాండా ప్రాంతంలో  భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ నెల  6న  బెంగాల్ రాష్ట్రంలోని  అలీపుర్డువార్ జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.6 గా నమోదైంది. ఈ నెల  4వ తేదీన నేపాల్ లో భూకంపం చోటు చేసుకుంది.ఈ భూకంపం కారణంగా  128 మంది మృతి చెందారు.