Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ లో ఆకలి చావులు.. ఉచిత ఆహార‌ పంపిణీలో తొక్కిసలాట, ఇద్దరు మృతి

Islamabad: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో  ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. జనం గుమిగూడడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ, ఒక పురుషుడు మృతి చెందారు. దీంతో పాటు ఎనిమిది మంది గాయపడ్డారు.
 

Starvation deaths in Pakistan, Stampede at free food distribution, two killed RMA
Author
First Published Mar 24, 2023, 12:20 PM IST

Starving in Pakistan: పాకిస్థాన్ లో ఆకలిమంటలతో ప్రజలు అలమటిస్తున్నారు. తినడానికి తిండి దొరక్క పలు ప్రాంతాల్లు ప్రాణాలు వదులుతున్నారు. ప్రజలు ఆక‌లి తీర్చ‌డానికి అంత‌ర్జాతీయ సాయం కోరుతున్న పాకిస్థాన్ లో ఇప్పుడు పిండి పప్పులు, ఇత‌ర ఆహారం కోసం ప్రజలు ప్రాణాలు వ‌దులుతున్నారు. పాక్ లో ప్ర‌స్తుతం పిండి ధ‌ర‌ల‌తో పాటు ఇత‌ర ఆహారప‌దర్థాల ధ‌ర‌లు మ‌రింత‌గా పెరిగాయి. ఈ సంక్షోభ స‌మ‌యంలో ప‌లువురు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తుండ‌గా తొక్కిస‌లాట జ‌రిగి ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. జనం గుమిగూడడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ, ఒక పురుషుడు మృతి చెందారు. దీంతో పాటు ఎనిమిది మంది గాయపడ్డారు. పాకిస్థాన్ జర్నలిస్ట్ ఇఫ్తికార్ ఫిర్దౌస్ ఓ వీడియోను ట్వీట్ చేసి అక్కడి దుర్భర పరిస్థితులను వివరించారు. "ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను ప్రాంతం అత్యంత సంప్రదాయవాద ప్రాంతాలలో ఒకటి. కానీ పేదరికం ఎంత తీవ్రంగా ఉందంటే ఇక్కడి మహిళలు రోడ్డున పడాల్సి వస్తోంది. మహిళలు రోడ్డుపై కూర్చొని" ఉన్న వీడియోను ఆయన ట్వీట్ చేశారు.

 

 

ప్రభుత్వ గోదాములో గోధుమలు చోరీ..

పాకిస్థాన్ లో ఓ వైపు సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మరోవైపు అధికారులు గోధుమలను అక్రమంగా అమ్మే పనిలో నిమగ్నమయ్యారు. సింధ్ ప్రావిన్స్ లోని 40 వేల టన్నుల గోధుమలను దొంగిలించిన 67 మంది అధికారులను పోలీసులు సస్పెండ్ చేశారు. దీంతో పాటు వారిపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే గోధుమలు రష్యా నుంచి పాకిస్తాన్ లో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారంగా నిలిచాయి. 10 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ గోదాముల నుంచి ఈ గోధుమలను దొంగిలించారు. ప్రస్తుతం పాక్ కరెన్సీలో కిలో గోధుమ‌లు రూ.150కి పైగా ధర పలుకుతోంది.

తిండిలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.. 

సింధ్ లోని సుర్జానీలో ఓ కుటుంబం ఆకలితో అలమటిస్తూ శనివారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios