Spanish PM Sanchez: "టై ధరించడం మానేయండి..ఇంధనాన్ని ఆదా చేయండి.." : స్పెయిన్ ప్రధాని
Spanish PM Sanchez: యూరప్ లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇంధన( విద్యుత్ ) వినియోగం పెరిగింది. ఈ క్రమంలో ఇంధనాన్ని ఆదా చేయడానికి తాత్కాలికంగా ‘టై’ ధరించడం మానేయండని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
Spanish PM Sanchez: ప్రస్తుతం యూరప్ లో వేడి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా.. ఉష్టోగ్రతులు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడికి తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పెరగడంతో అక్కడి ప్రజలు తల్లడిల్లితున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం జాతీయ ఎమర్జెన్సీ విధించింది.
ఈ తరుణంలో ఎండల నుంచి ఉపశమనం కోసం గణనీయంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వినియోగిస్తున్నారు. దీంతో ఇంధన వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో ఇంధన పొదుపు చర్యలను పాటించాలని ఐరోపా ప్రభుత్వాలు పౌరులకూ పిలుపునిస్తున్నాయి.
ఈనేపథ్యంలోనే స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నంలో భాగంగా.. తాత్కాలికంగా ‘టై’ ధరించడం మానేయాలని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను కోరారు
స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను టై ధరించడం లేదని, తన మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ రంగ కార్మికులు కూడా అదే చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇలా చేయడం ద్వారా ఉక్కపోత కాస్త తగ్గుతుందని, తద్వారా ఏసీల వినియోగం తగ్గి, ఇంధన ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఐరోపాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనీ, ప్రస్తుతం మాడ్రిడ్‌లో ఉష్ణోగ్రత 36 ° C , సెవిల్లెలో 39 ° C కి చేరుకుందని చెప్పారు.
ఈ క్రమంలోనే దేశంలో ఇంధన వినియోగం పెరిగిందని తెలిపారు. 'ది ఇండిపెండెంట్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం ఎయిర్ కండీషనర్ తరచుగా ఉపయోగించబడదని స్పెయిన్ ప్రధానమంత్రి వివరించారు.
ఇప్పటి వరకు 500 మంది మృత్యువాత
పెరుగుతున్న ఇంధన ఖర్చులతో పాటు, ఇటీవలి హీట్ వేవ్ గత రెండు వారాల్లో స్పెయిన్‌లో 500 మందికి పైగా మరణించారు. మరోవైపు.. యూరప్‌లోని చాలా భాగం తీవ్రమైన, భయపెట్టే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని యూరోపియన్ మీడియా అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ, అనేక దేశాలు ఏకకాలంలో శక్తిని ఆదా చేయడానికి, రష్యా నుండి వచ్చే గ్యాస్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనేక చర్యలను అనుసరించాయి. ఈ మేరకు యూరోపియన్ కమిషన్.. 21 వేల కోట్ల డాలర్లతో ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది.