యమా డేంజర్... 24గంటల్లో 2వేల మందికి సోకిన కరోనా

మిగిలిన దేశాలతో పోలిస్తే అన్నింటికంటే వేగంగా స్పెయిన్ లో వ్యాపిస్తోంది. కేవలం 24గంటల్లో 2వేల మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 100మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటి వరకు స్పెయిన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 7,753కి చేరింది. కాగా... చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది.
 
Spain reports 2,000 new COVID-19 cases and more than 100 deaths in a day

కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ లో మొదలైన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకేస్తోంది. భారత్ లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. అయితే... ఇప్పుడు.. దీని ప్రభావం స్పెయిన్ లోనూ మొదలైంది. స్పెయిన్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 

Also Read తెలంగాణలో మరో కరోనా కేసు...హైదరాబాద్ లో అలర్ట్...

మిగిలిన దేశాలతో పోలిస్తే అన్నింటికంటే వేగంగా స్పెయిన్ లో వ్యాపిస్తోంది. కేవలం 24గంటల్లో 2వేల మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 100మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటి వరకు స్పెయిన్ లో కరోనా సోకిన వారి సంఖ్య 7,753కి చేరింది. కాగా... చనిపోయిన వారి సంఖ్య 288కి చేరింది.

యూరప్ లో ఇటలీ తర్వాత ఎక్కువగా కరోనా ప్రభావితమైన దేశంగా స్పెయిన్ మారింది. ఇదిలా ఉండగా... ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వైరస్ తో 6,036 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,59,844మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇప్పటి వరకు కేవలం చైనాలోనూ ఎక్కువగా 3,199 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios