చంద్రయాన్ 3 ప్రయోగంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ఈ ప్రయోగాన్ని అతి తక్కువ బడ్జెట్‌తో చేపట్టారని ఓ ఎక్స్ హ్యాండిల్ ట్వీట్ చేయగా.. ఎలన్ మస్క్ స్పందించారు. గుడ్ ఫర్ ఇండియా అంటూ కామెంట్ చేశారు. 

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో స్పేస్‌పై ఆసక్తి విపరీతంగా పెరిగిపోతున్నది. తాజాగా, భారత్ చంద్రయాన్ 3 ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం ఈ మిషన్ చంద్రుడిపై ల్యాండ్ కానుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. దేశవ్యాప్తంగా ఈ మిషన్ విజయం కోసం ప్రార్థనలు జరుగుతున్నాయి. 

ఈ ఆసక్తి కేవలం దేశానికే పరిమితం కాలేదు. తాజాగా, పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరీ ప్రశంసలు కురిపించి పాకిస్తాన్ మీడియా కూడా ఈ మూన్ ల్యాండింగ్‌ను లైవ్‌లో ప్రసారం చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ అంతరిక్ష ప్రయోగ కేంద్రాలతో పోటీ పడుతూ ఓ ప్రైవేట్ కంపెనీ కూడా ప్రయోలు చేస్తున్నది. అదే స్పేస్ ఎక్స్. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్పేస్ ఎక్స్ ప్రయోగాల అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ మన చంద్రయాన్ 3పై స్పందించారు.

చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చాలా తక్కువ బడ్జెట్‌తో ప్రయోగించడంపై మాజీ జర్నలిస్టు సిండీ పామ్ తన న్యూస్ థింక్ హ్యాండిల్ ద్వారా ఓ పోస్టు ఎక్స్ పై చేశారు. ఇంటర్‌స్టెల్లార్ సినిమా బడ్జెట్ 165 మిలియన్లు అయితే.. చంద్రయాన్ 3 బడ్జెట్ కేవలం 75 మిలియన్లే అని చెప్పారు. దీనిపై ఎలన్ మస్క్ రియాక్ట్ య్యారు. ఇది భారత్‌కు మంచిది (గుడ్ ఫర్ ఇండియా) అని కామెంట్ చేశారు. దీనిపై ఎక్స్ యూజర్లు కూడా రియాక్ట్ అయ్యారు. ఇస్రో గొప్పదనంపై ఇప్పుడే ప్రపంచ యవనికపై చర్చ జరుగుతున్నదని కామెంట్లు చేశారు.

Also Read : అంతరిక్ష అన్వేషణలో భారత్ ముందంజలో ఉండటం ఆనందంగా ఉంది - భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్

ఇందుకు 2001: ఎ స్పేస్ ఒడిస్సీ, ది మార్షియన్, ఇంటర్‌స్టెల్లార్ వంటి ఖగోళ నేపథ్యంలో వచ్చిన అద్భుత హాలీవుడ్ చిత్రాలు ప్రేక్షకులను రంజింపచేశాయి. యువతలో విశేష ఆదరణ కలిగిన ఎలన్ మస్క్ వంటి వారు స్పేస్ ఎక్స్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ కంపెనీ కొత్త ఆవిష్కరణలు పంచుకోవడం, ఇటీవలే అంతరిక్ష పర్యాటకం పేరిట కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేయడం, వీటితోపాటు టెక్నాలజీ పెరిగి స్పేస్ గురించిన సమాచారం ప్రతి ఒక్కరి చేరువకావడం, విద్యార్థుల్లోనూ ఖగోళంపై ఆసక్తి పెరగడం వంటి పరిణామాలు వేగంగా జరిగాయి. బడా వ్యాపారులు, ప్రభుత్వాలూ అంతరిక్ష రంగంపై దృష్టి సారించడంతో చాలా దేశాలు అటు వైపుగా పోటీ పడుతున్నాయి.