దక్షిణకొరియా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే : కిమ్ సోదరి హెచ్చరిక
దక్షిణకొరియాతో తెగతెంపులు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని, ఇప్పటికే ఆలస్యమైందని ఆమె తన తాజా ప్రకటనలో అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనను వెలువరిస్తామని ఆమె అన్నారు.
దక్షిణ కొరియా పై ఉత్తర కొరియా తప్పక చర్యలు తీసుకుంటుందని, ఉత్తర కొరియా మిలిటరీ వాటిని అమలు చేస్తుందంటూ.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెల్లెలు కిమ్ యో జోంగ్ దక్షిణకొరియాను హెచ్చరించింది.
దక్షిణకొరియాతో తెగతెంపులు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని, ఇప్పటికే ఆలస్యమైందని ఆమె తన తాజా ప్రకటనలో అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనను వెలువరిస్తామని ఆమె అన్నారు.
గత కొద్దీ రోజులుగా బోర్డర్ కి ఆవల ఉన్న దక్షిణ కొరియా వైపునుంచి ఉత్తరకొరియా వ్యతిరేకంగా, ముఖ్యంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు, బెలూన్లను ఎగురవేస్తున్నారు. దీనిపై ఉత్తర కొరియా సీరియస్ గా ఉంది. అలా తమ దేశ వ్యతిరేక చర్యలను అడ్డుకోవడంలో దక్షిణకొరియా విఫలమైందని, ఇది యుద్ధానికి సూచకం అని ఆమె అన్నారు.
తన పత్రికాప్రకటనలో దక్షిణకొరియా ఈ చర్యలకు తగిన మూల్యం చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. తమ ఆర్మీ చీఫ్ నెక్స్ట్ అవసరమైన చర్యలను తీసుకుంటారని అధ్యక్షుడి సలహాదారుగా కిమ్ యో జోంగ్ అన్నారు.
ఒక నెలరోజుల కింద కరోనా వైరస్ కట్టడిలో చైనా విజయం సాధించిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. కరోనా పై సలిపిన పోరులో చైనా పూర్తి స్థాయిలో విజయం సాధించిందని కిమ్ కొనియాడారు. దాదాపు 20 రోజుల అజ్ఞాతవాసం తరువాత కిమ్ బయటకొచ్చిన వెంటనే ఇలా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కి ఈ సందేశాన్ని పంపించారు.
ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఇలా చైనా విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలపడంతోపాటు.... చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆరోగ్యాంగా ఉండాలని కూడా కిమ్ ఆకాంక్షిస్తున్నట్టు ఉత్తరకొరియా మీడియా తెలిపింది.
ఇకపోతే... ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం సరిగా లేదని.. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు తాజాగా చెక్ పడిన విషయం తెలిసిందే! చాలా రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఆయన రాకతో... ఆయన ఆరోగ్యం సరిగాలేదంటూ వార్తలు రాసిన జాతీయ మీడియా సంస్థలన్నింటికీ షాకిచ్చినట్లయ్యింది.
కొరియా లో జరిగిన ఓ ఎరువుల కంపెనీ ఓపెనింగ్ కు ఆయన హాజరైనట్టు తెలుస్తోంది. కార్యక్రమానికి ఆయన తో పటు అతడి సోదరి కూడా హాజరైనట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా కిమ్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఒకసారైతే ఏకంగా కిమ్ చనిపోయాడంటూ కూడా వార్త ట్రెండ్ అయ్యింది. దీనికి కారణం గుండె ఆపరేషన్ తరవాత కిమ్ మీడియా ముందుకు రాకపోవడమే. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఆయన మళ్లీ కనపడలేదు. దీంతో.. ఆరోగ్యం విషమించిందని.. అందుకే కనపడలేదని వార్తలు పుట్టుకువచ్చాయి.
ఇక కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఇలా మీడియాలో తరచుగా కనబడుతుండడం, ఆమె మాత్రమే మాట్లాడుతుండడం మరోసారి ఉత్తరకొరియా అధ్యక్షుడి పరిస్థితిపై అనుమానాలను రేకెత్తిస్తుంది.