నడవలేని తల్లి పై కొడుకు ప్రేమ.. నెట్టింట వీడియో వైరల్..!
ఓ యువకుడికి మాత్రం తనను కడుపులో మోసిన తల్లిని, తాను చేతులతో మోస్తూ, ఆ తల్లిని అపురూపంగా చూసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రతి తల్లి తన బిడ్డను నవ మోసాలు మోసిమరీ కంటుంది. అలా కన్న తర్వాత బిడ్డలను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. అలా ప్రేమను పంచిన తల్లికి బిడ్డలు కూడాపెద్దైన తర్వాత ప్రేమను పంచుతారు. బాగా చూసుకుంటారు. కానీ ఓ యువకుడికి మాత్రం తనను కడుపులో మోసిన తల్లిని, తాను చేతులతో మోస్తూ, ఆ తల్లిని అపురూపంగా చూసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఆ వీడియో ప్రకారం, ఓ యువకుడు తన తల్లిని చేతులతో మోస్తూ కనిపించాడు. విమానంలో వారు ప్రయాణించాల్సి ఉంది. అయితే అతని తల్లి నడవలేని పరిస్థితిలో ఉంది. దీంతో, తన చేతులతో మోస్తూ, విమానంలోకి తీసుకువచ్చి, సీట్లో కూర్చోపెట్టాడు. అతను, తల్లిపై చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి ప్రేమ చూపించే కొడుకు దొరకడం ఆమె అదృష్టం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వేలల్లో వ్యూస్ , కామెంట్ల వర్షం కురుస్తోంది.