"బాధితుల నుండి విలువైన వస్తువులను దొంగిలించడమే" వీరి లక్ష్యం అని అనుమానిస్తున్నారు. ఈ నేరంలో అనుమానితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
బ్రెజిల్ : బ్రెజిల్‌లో తన భార్య, ముగ్గురు చిన్న పిల్లలు, తన తల్లి, సోదరిని హత్య చేసిన కేసులో అనుమానితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి తన తండ్రితో కుమ్మక్కయ్యాడని, అందుకే వారందరినీ హత్య చేశాడని ఆరోపించారు. అతనికోసం బుధవారం పోలీసులు గాలింపు చేపట్టారు.
"ఈ పిల్లల తండ్రి, తాత ఇంకా బతికే ఉన్నారా, వారు ఈ దారుణమైన నేరానికి పాల్పడ్డారా? అని ధృవీకరించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి" అని రాజధాని జిల్లా బ్రెసిలియాకు చెందిన పరిశోధకుడు రికార్డో వియానా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, 39 ఏళ్ల మహిళ, ఆమె ముగ్గురు పిల్లలు.. వీరిలో ఓ అబ్బాయి వయసు ఏడు సంవత్సరాలు కాగా, మరో ఇద్దరు ఆరేళ్ల కవలల అబ్బాయిలు, ఆమె భర్త, అత్తమామలు, సోదరితో పాటు తప్పిపోయినట్లు కేసు నమోదయ్యింది.
వచ్చే నెలలో రాజీనామా చేస్తున్నాను.. న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ సంచలన ప్రకటన
ఆ తరువాత కుటుంబానికి చెందిన రెండు కార్లు గోయాస్, మినాస్ గెరైస్ రాష్ట్రాల్లో కనుగొనబడ్డాయి. ఈ రెండు కార్లలో ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తుల కాలిపోయిన అవశేషాలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం, ఫెడరల్ డిస్ట్రిక్ట్‌లోని ప్లానాల్టినా ప్రాంతంలోని ఒక ఇంట్లో ఏడవ మృతదేహాన్ని కనుగొన్నారు. అక్కడ కొంతమంది బాధితులను బందీలుగా ఉంచినట్లు సివిల్ పోలీసులు తెలిపారు.
"బాధితుల నుండి విలువైన వస్తువులను దొంగిలించడమే" చివరి లక్ష్యంగా ఈ నేరంలో కనిపిస్తోందని.. ఈ నేరంలో ప్రమేయం ఉన్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ నేరంలో 100,000 రియాస్ (సుమారు $19,000) డబ్బులు దక్కినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. దర్యాప్తు అధికారులకు పిల్లల తండ్రి, తాత నేరంలో భాగస్వాములుగా ఉన్నారని.. ఆ తరువాత పారిపోయారని చెప్పారు.
