వాషింగ్టన్:అమెరికాలోని మిల్‌వాకీ నగరంలో మాల్‌సన్ కూర్స్ బ్రీవింగ్ కంపెనీ క్యాంపస్ ఆవరణలో గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురుమృతి చెందారు.

కాల్పులు జరిపిన వ్యక్తిని 51 ఏళ్ల మిల్ వాకీకి చెందిన వాసిగా గుర్తించారు. కాల్పులు జరిపిన తర్వాత అతను కూడ గాయాలతో మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు.

Also read:సినీ ఫక్కీలో బార్లలో కాల్పులు.. 8మంది మృతి

ఈ కంపెనీలో వందలాది మంది పనిచేస్తున్న సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపినట్టుగా చెప్పారు. ఈ ఘటనను విషాదకరమైందిగా మిల్ వాకీ మేయర్  టామ్ బర్రెట్ చెప్పారు.

దీన్ని భయంకరమైన చర్యగా ఆయన అభివర్ణించారు.ఈ కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను అతను కాల్చి చంపాడని పోలీసులు చెప్పారు.ఈ విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది, ఎఫ్ బీ ఐ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఈ ఘటనతో స్కూళ్లు, వ్యాపార సంస్థలు మూసివేశారు. అమెరికాలో ఈ తరహ ఘటనలు  తరచూ చోటు చేసుకోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.