బ్రెజిల్‌లో రియో డి జనీరోలోని ఫవేలాలో దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 6 గురు చనిపోయారు.
బ్రెజిల్‌లో రెండో అతి పెద్ద నగరమైన రియో డి జనీరోలోని ఫవేలాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దీంతో పోలీసులు కూడా అక్కడి చేరుకొని ఫైరింగ్ మొదలు పెట్టాల్సి వచ్చింది. పోలీసులకు, దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు 6 గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Pakistan torrential rains : పాకిస్థాన్ లో కుండపోత వర్షాలు.. కరాచీలో 20 మంది మృతి..
రియో డి జెనీరోలోని నార్త్ జోన్‌లోని మాంగ్విన్‌హోస్‌లోని ఫవేలాలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగిందని రియో డి జనీరో సివిల్ పోలీసులు తెలిపారు. పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు భీకర కాల్పులు జరిగాయి, దీంతో ఈ ప్రాంతంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. కాగా ఘటన చోటు చేసుకున్న మాంగ్విన్‌హోస్ ఫవేలా ప్రాంతం రియో డి జనీరో సివిల్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చైనాలో బ్యాంకు ఖాతాదారులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఏమిటీ?
మూడు రోజుల కిందట దక్షిణాఫ్రికాలోని ఓ బార్‌లో కూడా ఇలాగే భీకర కాల్పులు జరిగాయి. దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 14 మంది మరణించారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జొహన్నెస్‌బర్గ్‌లోని సొవెటో టౌన్‌షిప్‌లో శనివారం - ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ గ్రూప్ మినీ బస్ ట్యాక్సీలో ఆ బార్‌కు వచ్చి అక్కడున్న ప్రజలపై శనివారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది అక్కడిక్కడే చనిపోయారు. పోలీసులకు ఈ విషయం తెలియగానే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను హాస్పిటల్‌కు తరలించారు. గాయాలపాలైన ముగ్గుర పరిస్థితి విషమంగా ఉండటంతో క్రిస్ హనీ భరగ్వనాథ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు
