జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అబే పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జపాన్ మాజీ ప్రధాని (Former Japanese Prime Minister) షింజో అబే (Shinzo Abe) పై దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపారు. దాడి చేశారు. శుక్రవారం ఉదయం ఆయన పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో లోని ఓ వీధిలో ఆయన స్టంప్ స్పీచ్ ఇస్తుండగా వెనక నుంచి ఓ వ్యక్తి దాడి చేశారు. దీంతో ఆయన ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. అయితే ఆ దుండగుడిని ఉదయం 11.30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ‘జపాన్ టైమ్స్’ తెలిపింది.
ఈ దాడి వల్ల షింజో అబేకు గాయాలు అయ్యాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో న్యూస్ కవర్ చేస్తున్న NHK రిపోర్టర్ తుపాకీ శబ్దం విన్నానని తెలిపారు. అలాగే అబేకు రక్త స్రావం జరిగిందని చెప్పారు.
అయితే ఈ దాడి తర్వాత అబేలో ఎలాంటి ప్రతిస్పందనా కనిపించడం లేదని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయని వార్తా సంస్థ AFP నివేదించింది.
