సానియాతో విడిపోయారనే పుకార్లు: పాకిస్తాన్ నటి సనా జావెద్‌తో షోయబ్ మాలిక్ పెళ్లి
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆ దేశ టీవీ నటి సనా జావెద్ ను వివాహం చేసుకున్నాడు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ స్టార్ నటి సనా జావెద్ ను వివాహం చేసుకున్నాడు. సానియా మీర్జాతో షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నాడనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. సోమవారంనాడు షోయబ్ మాలిక్ తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను షోయబ్ మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.
షోయబ్ మాలిక్, సనా జావెద్ డేటింగ్ చేస్తున్నట్టుగా పుకార్లు వచ్చాయి. గత ఏడాది సనా జావెద్ పుట్టిన రోజున ఆమెకు షోయబ్ మాలిక్ గ్రీటింగ్స్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే బడ్డీ అంటూ షోయబ్ మాలిక్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో సనా జావెద్ తో కలిసి ఉన్న ఫోటోు షేర్ చేశాడు.
సనా జావెద్ శనివారం నాడు తన సోషల్ మీడియా ఖాతాలో కూడ ఈ వేడుకకు సంబంధించి ఫోటోలను కూడ పోస్ట్ చేశారు. 2010లో షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. సానియా మీర్జాను వివాహం చేసుకొనే ముందు ఆయేషా సిద్దిఖీకి ఆయన విడాకులు ఇచ్చాడు.
సనా జావెద్ కూడ తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో పేరును మార్చుకుంది. సనా షోయబ్ గా మార్చింది. సనా జావెద్ 2020 లో గాయకుడు ఉమర్ జస్వాల్ ను వివాహం చేసుకన్నారు.వీరిద్దరూ 2023లో విడాకులు తీసుకున్నారు.