ఢాకా: రెండు రోజుల పర్యటనలో పాల్గొనేందుకు గాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు బంగ్లాదేశ్ కు చేరుకొన్నారు.

కరోనా తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా విదేశీ పర్యటనలో పాల్గొన్నారు.బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే ముందు ఆ దేశంతో పలు అంశాలపై చర్చలు జరపాలని  తాము బావిస్తున్నామని మోడీ ప్రకటించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ను కూడ ప్రధాని మోడీ కలిసే అవకాశం ఉంది.

ఇవాళ ఉదయం మోడీ 7:45 గంటలకు బంగ్లాదేశ్ కు బయలుదేరారు. ఉదయం 10 గంటలకు ఢాకాకు చేరుకొన్నారు. ఢాకా ఎయిర్‌పోర్టులో  మోడీకి బంగ్లాదేశ్ ప్రధాని హాసీనా స్వాగతం పలికారు.

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.