Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ ఎఫెక్ట్ : ప్రపంచవ్యాప్తంగా పెరిగిన లైంగిక హింస.. యూఎన్

కరోనా మహమ్మారి జీవితాలపై అనేక రకాలుగా దుష్ప్రభావాలను చూపిస్తోంది. శారీరక, మానసిక స్థితిని ప్రభావితం చేయడం అందరికీ తెలిసిన విషయం అయితే.. మహమ్మారి కారణంగా గత ఏడాది లైంగిక హింస పెరిగిందని ఐక్యరాజ్యసమితి తాజాగా పేర్కొంది.

sexual violence is increased in world wide due to covid : UN - bsb
Author
Hyderabad, First Published Apr 14, 2021, 12:26 PM IST

కరోనా మహమ్మారి జీవితాలపై అనేక రకాలుగా దుష్ప్రభావాలను చూపిస్తోంది. శారీరక, మానసిక స్థితిని ప్రభావితం చేయడం అందరికీ తెలిసిన విషయం అయితే.. మహమ్మారి కారణంగా గత ఏడాది లైంగిక హింస పెరిగిందని ఐక్యరాజ్యసమితి తాజాగా పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సైన్యాలు, సాయుధ మూకలు లైంగిక హింసను ఒక యుద్ధ వ్యూహంగా, రాజకీయ అణచివేత కొరకు ఉపయోగించుకున్నాయి అని తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 

మొత్తం 18 దేశాల్లో 52 సైన్యాలు లేదా సాయుధ మూకలు మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు తమ వద్ద ధ్రువీకృత సమాచారం ఉందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. 

ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిలో అత్యధిక శాతం ప్రభుత్వేతర మూకలు ఉన్నాయి. ప్రతిపక్షాలు, తిరుగుబాటు బృందాలు, ఆల్-ఖైదా లేదా ఇస్లామిక్ స్టేట్ తో సంబంధమున్న ఉగ్ర మూకలు ఎక్కువగా ఉన్నాయి. 

ఈ జాబితాలో ఉన్న ప్రభుత్వ సైన్యం లేదా అధికారిక పోలీసు బలగాలను ఐక్యరాజ్యసమితి శాంతి  కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించారు. ఈ బ్లాక్ లిస్ట్ లో కాంగో, దక్షిణ సూడాన్ లోని ప్రభుత్వ, పోలీసు బలగాలు, నిఘా వర్గాలు, సూడాన్ లో సాయుధ బలగాలు ఉన్నాయి. చాలా చోట్లమహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు’ అని ఆ నివేదికలో యూఎన్ పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios