Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్ బాంబు పేలి ఏడుగురు మృతి.. 41 మందికి గాయాలు..

ఆఫ్ఘనిస్తాన్ లో బాంబు దాడులు ఆగడం లేదు. ఆ దేశంలో తాలిబాన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి తరచూ ఇలా పేలుళ్లు జరుతూనే ఉన్నాయి. తాజాగా కాబూల్ లోని ఓ మసీదుపై బయట బాంబు పేలింది. ఈ ఘటనలో 7 గురు చనిపోయారు. 

Seven killed in Afghanistan bomb blast 41 people were injured.
Author
First Published Sep 24, 2022, 10:19 AM IST

ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలో కాబూల్ లో మసీదు బ‌య‌ట శుక్ర‌వారం కారు బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో దాదాపు ఏడుగురు మ‌ర‌ణించారు. ప్రార్థ‌న‌లు చేసి బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మయంలో ఈ దాడి జ‌రిగింది. పిల్ల‌ల‌తో పాటు దాదాపు 41 మందికి గాయాలు అయ్యింది. అయితే ఈ బాంబు దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. ఏడాది కింద‌ట ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్ప‌టి నుంచి ఆ దేశంలో బాంబు దాడులు జ‌రుతున్నాయి.

ఐరాసలో మ‌రోసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ ప్ర‌ధాని

ఈ తాజా ఘ‌ట‌న‌లో పేలుడు పదార్థాలతో కూడిన కారును మసీదు సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచారని అధికారులు చెప్పారు. శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని భక్తులు బయటకు వస్తుండగా పేలుడు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ఠాకోర్ మాట్లాడుతూ.. ‘‘ ఆరాధకులు ఇంటికి వెళుతుండగా పేలుడు సంభవించింది. పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి దర్యాప్తు జరుగుతోంది. ’’ అని చెప్పారు.

ప‌శువుల మేత‌కు వెళ్లిన మ‌హిళ‌ కిడ్నాప్.. 36 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. 3 ల‌క్ష‌లు ఇచ్చిన త‌రువాత విడుద‌ల

మసీదు వెలుపల రోడ్డుపై మంటల్లో చిక్కుకున్న కారుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ దాడిని ఇంతవరకు ఏ గ్రూపు ప్రకటించనప్పటికీ, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇటీవలి నెలల్లో మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది.

బీహార్‌లో ప్రధాని మోదీపై దాడికి పీఎఫ్‌ఐ కుట్ర.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..! 

శుక్రవారం ప్రార్థనలు ముగించుకుని వజీర్ అక్బర్ ఖాన్ మసీదు నుంచి బయటకు వస్తుండగా ఉద్దేశ్యపూర్వకంగానే ఆరాధకులను లక్ష్యంగా చేసుకున్నారని కాబూల్ పోలీసు ముఖ్య అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios